VK Naresh: సకల సౌకర్యాలు ఉన్న లగ్జరీ కారవ్యాన్ కొనుగోలు చేసిన యాక్టర్ నరేష్.ఫోటోస్ వైరల్.. 

పండంటి కాపురం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి.. బాల నటుడిగా.. హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా ఎన్నో చిత్రాల్లో

VK Naresh: సకల సౌకర్యాలు ఉన్న లగ్జరీ కారవ్యాన్ కొనుగోలు చేసిన యాక్టర్ నరేష్.ఫోటోస్ వైరల్.. 
Naresh

Updated on: Jan 25, 2022 | 5:34 PM

పండంటి కాపురం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి.. బాల నటుడిగా.. హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా ఎన్నో చిత్రాల్లో నటించారు నటుడు నరేష్ విజయకృష్ణ (Naresh VK). తన నటనతో ప్రేక్షకులను మెప్పించి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నరేష్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా గడిపేస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాణ రంగంలోనూ రాణిస్తున్నాడు. సంవత్సర కాలంలో ఆరేడు చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు వీలైనన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఎప్పుడు షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే నరేష్.. ఇప్పుడు తన కోసం ప్రత్యేకంగా ఓ లగ్జరీ కారవ్యాన్(Caravan)  కొన్నాడు. అంతేకాదు.. ఆ కారవ్యాన్‏ను స్పెషల్‏గా డిజైన్ చేయించుకున్నాడట.

ప్రస్తుతం చేతి నిండా సినిమాతో బిజీ షెడ్యూల్ గడిపేస్తున్నాడు నరేష్. దీంతో ఇంట్లో కంటే ఎక్కువ సమయం షూటింగ్ స్పాట్‏లోనే గడిపేస్తున్నాడట. అయితే ప్రస్తుతం పరిస్థితులలో ఇతర నటీనటులు వాడిన కారవ్యాన్ వాడడం అంత మంచిది కాదని భావించిన నరేష్.. తన కోసం ప్రత్యేక కారవ్యాన్ తీసుకున్నాడట.

Vk Naresh

అందులో తనకు కావాల్సిన సదుపాయాలు ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడట. అందులో ఏసీ బెడ్, మేకప్ ప్లేస్, జిమ్, వెయిటింగ్ రూమ్, వాష్ రూంతో సహా అన్ని సౌకర్యాలు ఉన్నాయట. ఈ కారవ్యాన్‏ను ముంబై నుంచి తెప్పించారట. అంతేకాదు.. ఈ కారవ్యాన్ కోసం నరేష్ భారీగానే ఖర్చుచేశారట.. మొత్తానికి స్టార్ హీరోలతోపాటు.. నటుడిగా నరేష్ కూడా భారీగా ఖర్చు చేసి కారవ్యాన్ కొనుగోలు చేశాడు.

Also Read: BA Raju Son Wedding: పెళ్లిపీటలెక్కిన దివంగత నిర్మాత బీఏ రాజు తనయుడు.. సరిగ్గా అదే ముహూర్తానికి..

Namrata Shirodkar : అంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అంటున్న మహేష్ సతీమణి.. వైరల్ అవుతున్న పోస్ట్

Dhanush And Aishwaryaa: విడాకుల ప్రకటన తర్వాత బిజీగా మారిపోయిన ధనుష్, ఐశ్వర్య.. ఏం చేస్తున్నారంటే..

Rashmi Gautam: హాట్ టాపిక్ గా యాంకర్ రష్మీ పెళ్లి టాపిక్.. సీక్రెట్ గా చేసేసుకుందంటూ గుసగుసలు