Vishal: సినిమాలు తీస్తూనే ఉంటా.. ఏమైనా చేసుకోండి.. వారికి విశాల్ మాస్ వార్నింగ్..

|

Jul 27, 2024 | 11:59 AM

2017 నుంచి 2019 వరకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన విశాల్... పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారు తమిళ ప్రొడ్యూసర్లు. కోటి కాదు రెండు కోట్లు కాదు.... ఏకంగా 12 కోట్ల రూపాయలను విశాల్‌ దారి మళ్లించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ విమర్శలు చేశారు.

కోలీవుడ్ హీరో విశాల్‌ను ఇప్పుడు నిర్మాతలు టార్గెట్‌ చేశారు. టార్గెట్‌ అంటే మామూలుగా కాదు.. అంతకుమించి.. ఈ హీరో సినిమాకి పనిచేయాలంటే… టెక్నీషియన్‌ దగ్గర్నుంచి ఆర్టిస్టుల వరకు ప్రతిఒక్కరూ పర్మిషన్‌ తీసుకోవాల్సిందే. పర్మిషన్‌ తీసుకోకుంటే… ఇక వాళ్ల పని అయిపోయినట్లే. ఇండస్ట్రీ నుంచి అవుట్‌ అవుతారంటూ సుధీర్ఘ లెటర్ రాసి తమిళ నిర్మాతల మండలి రిలీజ్‌ చేయడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 2017 నుంచి 2019 వరకు నిర్మాతల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన విశాల్… పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపిస్తున్నారు తమిళ ప్రొడ్యూసర్లు. కోటి కాదు రెండు కోట్లు కాదు…. ఏకంగా 12 కోట్ల రూపాయలను విశాల్‌ దారి మళ్లించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నడిగర్ సంఘం అధ్యక్షుడిగా విశాల్ ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ విమర్శలు చేశారు. మరిన్ని వివరాలు కావాలంటే పైన వీడియో చూసేయ్యండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.