Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా ?.. వీడియో షేర్ చేసిన రౌడీ హీరో..

యంగ్ హీరో విజయ్ దేవరకొండ... సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. తనతోపాటు.. బెడ్ షేరే చేసుకున్నది

Vijay Devarakonda: విజయ్ దేవరకొండతో బెడ్ షేర్ చేసుకున్నది ఎవరో తెలుసా ?.. వీడియో షేర్ చేసిన రౌడీ హీరో..
Vijay Devarakonda

Updated on: Nov 10, 2021 | 11:05 AM

యంగ్ హీరో విజయ్ దేవరకొండ… సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతుంది. తనతోపాటు.. బెడ్ షేరే చేసుకున్నది ఎవరో గెస్ చేయాలంటూ ఆ వీడియోను షేర్ చేశారు రౌడీ. ప్రస్తుతం విజయ్.. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అనన్య హీరోయిన్‏గా నటిస్తుంది. ఇక విజయ్‏తోపాటు.. ఆయన తమ్ముడు ఆనంద్ కూడా హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం పుష్పక విమానం.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వర్క్ తన భూజాలపై వేసుకున్నాడు విజయ్ దేవరకొండ. గత కొద్ది రోజులుగా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాడు విజయ్. ఈ క్రమంలోనే కాస్త డిఫరెంట్‏గా బెడ్ రూమ్ వీడియో ప్లాన్ చేసి ఆసక్తి కలిగించారు విజయ్. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా.. దేవరకొండ బ్రదర్స్ విశాఖపట్నంలోని ఒక హోటల్‏లో బస చేశారు. ఈ క్రమంలోనే తమ్ముడితో కలిసి బెడ్ పై నిద్రిస్తున్న విజయ్… మధ్యలో లేచి.. తమ్ముడిని సుందర్ అని పిలుస్తూ నిద్ర లేపాడు.. నువ్వు ఇక్కడ ఉన్నావేంటిరా ? నీ పెళ్లాం ఏది ? అంటూ పలుమార్లు ఆనంద్ దేవరకొండను విసిగించాడు విజయ్. దీంతో నా పెళ్లాం లేచిపోయిందిరా అని చెప్పి మళ్లీ ముసుగు పెట్టుకుని పడుకున్నారు ఆనంద్.. ఈ ఫన్నీ వీడియోను విజయ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ తెగ వైరల్ అవుతుంది. దేవరకొండ ప్రమోషన్స్ వీర లెవల్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇక ఆనంద్ నటించిన పుష్పక విమానం సినిమాను డార్క్ కామెడీ నేపథ్యంలో కింగ్ ఆఫ్ ది హిల్స్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి దామోదర అనే కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించగా.. శాన్వి మేఘన, గీత సైనీ హీరోయిన్లుగా నటించారు. ఇందులో సునీల్, సీనియర్ నరేష్ కీలక పాత్రలలో నటించారు.

Also Read: Anasuya Bharadwaj: పుష్ప నుంచి దాక్షాయణి పోస్టర్ రిలీజ్.. అదిరిపోయిన అనసూయ న్యూలుక్..

Anasuya Bharadwaj: అవసరమైతే.. గుండు కొట్టించుకుంటా.. యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్