Lakshya Trailer: లక్ష్య ట్రైలర్ వచ్చేసింది.. మరోసారి అదరగొట్టిన నాగశౌర్య..

|

Dec 01, 2021 | 4:46 PM

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి

Lakshya Trailer: లక్ష్య ట్రైలర్ వచ్చేసింది.. మరోసారి అదరగొట్టిన నాగశౌర్య..
Lakshya
Follow us on

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటించిన లెటేస్ట్ చిత్రం లక్ష్య. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించగా.. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా లక్ష్య సినిమా ట్రైలర్‏ను హీరో వెంకటేష్ విడుదల చేశారు.

తాజాగా విడుదలైన ట్రైలర్‏లో నాగశౌర్య సరికొత్త లుక్‏లో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు. అలాగే ఇందులోని డైలాగ్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక మరోవైపు జగపతి బాబు మరోసారి తన నటనతో అదరగొట్టాడు. నాగశౌర్య విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై. లి. బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

ట్రైలర్..

Also Read: Pragya Jaiswal: బాలయ్య భామ పరువాల విందు.. మరోసారి అదరగొట్టిన ప్రగ్యా లేటెస్ట్ పిక్స్

Ajith Kumar: అభిమానులకు హీరో అజిత్ విజ్ఞప్తి.. ఇకపై తనను అలా అని పిలవద్దంటూ..

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..