
సాధారణంగా ఏటా కార్తీక మాసం నుంచి.. మకర సంక్రాంతి వరకూ ఎక్కువ మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటారు. ప్రస్తుతం కార్తీక మాసం ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు అయ్యప్ప మాలలు ధరిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తున్నారు. సామాన్యులతో పాటు సినిమా సెలబ్రిటీలు కూడా అయ్యప్ప స్వామి మాలను ధరిస్తారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, నితిన్, రామ్ పొతినేని, వరుణ్ తేజ్, శర్వానంద్, ఎన్టీఆర్, న్యాచురల్ స్టార్ నాని.. ఇలా చాలా మంది హీరోలు అయ్యప్ప మాల ధరించిన వారే. నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని పూజించి శబరిమలేషుడిని దర్శించుకున్నవారే. తాజాగా ఈ ఏడాది మరో టాలీవుడ్ యంగ్ హీరో అయ్యప్పమాలను ధరించాడు. అనంతరం భార్యతో కలిసి ఓ ఆలయంలో ఫొటోలు దిగాడు. ఆ తర్వాత వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ‘ స్వామియే శరణం అయ్యప్ప’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? వరుణ్ సందేశ్.
గతంలోనూ పలు మార్లు వరుణ్ సందేశ్ అయ్యప్ప మాలను ధరించినట్లు తెలుస్తోంది. అలా ఈ ఏడాది కూడా అయ్యప్ప దీక్షను స్వీకరించి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడీ టాలీవుడ్ యంగ్ హీరో. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల కానిస్టేబుల్ అనే సినిమాతో అభిమానులను పలకరించాడు వరుణ్ సందేశ్. ఆర్యన్ సుభాష్ అనే దర్శకుడు తెరకెక్కించిన ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో మధులిక వారణాసి హీరోయిన్ గా నటించింది. అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. సినిమాలోని కంటెంట్ కు, వరుణ్ సందేశ్ యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఎందుకో గానీ లాంగ్ రన్ కొనసాగించలేకపోయింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి