Suriya : తండ్రి గురించి ఇంట్రెస్టింగ్ వీడియే షేర్ చేసిన సూర్య.. ఎందుకంటే..

కోలీవుడ్ హీరో సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 సినిమాలోనూ నటిస్తున్నారు. ఇవే కాకుండా అటు డైరెక్టర్ వెట్రిమారన్‌తో వాడివాసల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు.

Suriya : తండ్రి గురించి ఇంట్రెస్టింగ్ వీడియే షేర్ చేసిన సూర్య.. ఎందుకంటే..
Suriya

Updated on: Jan 30, 2025 | 8:47 PM

సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో సూర్య ఒకరు. ఇటీవలే కంగువ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. కానీ అతడి పేరును డైరెక్టర్ మణిరత్నం సూర్యగా మార్చారు. సూర్య తన తొలినాళ్లలో నటనపై ఆసక్తి చూపలేదు మరియు తన చిన్నతనం నుండి దర్శకుడిని కావాలనుకున్నాడు. నటుడు సూర్య తన చదువు పూర్తయ్యాక నటన రంగంలోకి రాకముందు కార్మెన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశాడు. 1997లో వసంత్ దర్శకత్వం వహించిన మణిరత్నం ‘నెరుకు నేర్’తో సూర్య సినీ రంగ ప్రవేశం చేశారు. సూర్య సినిమాల్లోకి వచ్చిన మొదటి 4 సంవత్సరాలు పెద్ద హిట్ ఇవ్వలేకపోయాడు. 2001లో విడుదలైన ‘నంద’ సినిమా సూర్య సినీ జీవితంలో కీలక మలుపు తిరిగింది.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2003లో వచ్చిన కాకా కాకా చిత్రంలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆయన నటించిన గజిని, సింగం లాంటి ఎన్నో సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్‌ అయ్యాయి. ఆ తర్వాత సూర్య నటించిన సురారై పోటోటు చిత్రం కూడా బాలీవుడ్‌లో రీమేక్‌ చేసి విడుదల కావడం గమనార్హం. ఇటీవల విడుదలైన కంగువ విజయాన్ని అందుకోలేదు. యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించారు. 10కి పైగా భాషల్లో 3డి టెక్నాలజీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సూర్య.. తాజాగా తన తండ్రి శివకుమార్ గురించి ఆసక్తికర వీడియో షేర్ చేశాడు. అందులో వాటర్ కలర్, స్పాట్ పెయింటింగ్ పట్ల తన తండ్రికి ఉన్న నిస్వార్థ ప్రేమను భారతీయ పోస్టల్ డిపార్ట్‌మెంట్ పోస్ట్ కార్డ్‌లుగా మార్చి చిరస్థాయిగా మార్చిందని.. తన తండ్రి ఘనతకు గర్వపడుతున్నట్లు తెలిపారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..