AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya – Jyotika: జ్యోతికతో ప్రేమలో పడడానికి కారణం ఆ సినిమానే.. మొదటి సారి చెప్పిన హీరో సూర్య..

తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అగ్ర కథానాయకుడు సూర్య (Suriya). కేవలం ఒక స్టార్ హీరోగానే కాకుండా, అద్భుతమైన నటుడిగా, నిర్మాతగా, అంతకంటే మిన్నగా సమాజ సేవకుడిగా ఆయనకు ఎంతో మంచి పేరుంది. సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ సూర్య మొదట్లో గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేశారు. ఆ తర్వాత 1997లో మణిరత్నం నిర్మించిన 'నెరుక్కు నేర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Suriya - Jyotika: జ్యోతికతో ప్రేమలో పడడానికి కారణం ఆ సినిమానే.. మొదటి సారి చెప్పిన హీరో సూర్య..
Suriya, Jyotika
Rajitha Chanti
|

Updated on: Jun 13, 2026 | 4:24 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. గతంలో సూర్య ఓ తన అభిమానులకు తమ వ్యక్తిగత జీవితం, ప్రేమ ప్రయాణం, కుటుంబ విశేషాల గురించి పంచుకున్న విషయాలు ఇప్పుడు మరోసారి వైరలవుతున్నాయి.. ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ ఇంటర్వ్యూలో సూర్య, జ్యోతికల అద్భుతమైన ప్రేమకథ, వారి కూతురు దియా గురించి చెప్పిన విషయాలు ఎంతో ఆకట్టుకున్నాయి. జ్యోతికతో తన తొలి పరిచయం 1999లో పూవెల్లం కెట్టుపార్ చిత్రం సెట్‌లో జరిగిందని సూర్య వెల్లడించారు. ఇది జ్యోతికకు మొదటి తమిళ చిత్రం కాగా, సూర్యకు నాల్గవది. దర్శకుడు వసంత్ వారిని ఒకరికొకరు పరిచయం చేశారని, వారి మొదటి షాట్ కూడా ఎంతో ప్రత్యేకమైనదని సూర్య గుర్తుచేసుకున్నారు. ఆ షాట్‌లో వారు చేతులు పట్టుకొని మార్చ్ పాస్ట్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆ రోజు చేతులు కలిసిన వారిద్దరు, ఇప్పుడు జీవితాంతం తోడుగా ఉన్నారని సంతోషంగా చెప్పారు. తమ జీవితాల్లో వసంత్ పాత్రకు ఎప్పటికీ కృతజ్ఞులమని, ఆయనే తమను కలిపారని సూర్య పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ప్రేమ ఎలా వికసించింది..

వారి మధ్య ప్రేమ ఎలా మొదలైందని అడిగినప్పుడు, అది ఒక ప్రక్రియ అని, తాము ఎప్పుడు ప్రేమలో పడ్డామో ఖచ్చితంగా తెలియదని సూర్య అన్నారు. తమ మొదటి రెండు చిత్రాలలో తాము ఎక్కువగా మాట్లాడుకోలేదని, అప్పట్లో జ్యోతిక తనకంటే పెద్ద నటి అని, ఆమె చాలా విజయవంతమైందని సూర్య అన్నారు. ఆ తర్వాత రెండు, మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చిందని, ఆ తర్వాత కాక కాక చిత్రం కోసం మళ్లీ కలిశామని చెప్పారు. ఈ చిత్ర సమయంలోనే వారి మధ్య స్నేహం మరింత బలపడి ప్రేమగా మారిందని సూర్య తెలిపారు. తాను జ్యోతికకు పెద్ద అభిమానినని, వారి బంధం స్నేహం నుండి ప్రేమగా మారి, ఇప్పుడు జీవితాంతం కలిసి ఉన్నామని వివరించారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

వివాహం తర్వాత వారి బంధంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతూ, జ్యోతికలో ఎటువంటి మార్పు లేదని, తాను మాత్రం చాలా మారిపోయానని సూర్య పేర్కొన్నారు. తాను గతంలో చాలా నిశ్శబ్దంగా, సంయమనంతో ఉండేవాడినని, ఇప్పుడు చాలా బిజీ అయ్యానని, కుటుంబంతో గడపడానికి సమయం లేదని జ్యోతిక తరచుగా చెబుతుందని అన్నారు. ఈ విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. జ్యోతిక అద్భుతమైన భార్య, తల్లి అని, తమ కూతురు దియాను 24 గంటలు చూసుకుంటుందని సూర్య ప్రశంసించారు. తమ కూతురు దియా పేరు ఎలా వచ్చిందో కూడా సూర్య పంచుకున్నారు. వారు ఒక చిన్న, అర్ధవంతమైన పేరును కోరుకున్నారని చెప్పారు. మొదట కియా అనే పేరును కూడా పరిశీలించారని, కియా అంటే పువ్వు అని అర్థమని, అది కూడా నచ్చిందని తెలిపారు. అయితే, దియా అనే పేరు అనుకోకుండా వచ్చిందని, అది కాంతి మూలం అనే అర్థాన్ని సూచిస్తుందని, తమకు నచ్చిందని సూర్య వివరించారు. దియా అంటే ఆమె స్వభావానికి, రూపానికి బాగా సరిపోతుందని భావించి ఆ పేరును ఖరారు చేశామన్నారు.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

సూర్య పోస్ట్..

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

Follow Us