
మరి కంగువ టీమ్ కల నిజమవుతుందా..? ఈ సినిమా 2000 కోట్ల మార్క్‌ను రీచ్ అవుతుందా? ఈ విషయంలో క్లారిటీ రావాలంటే నవంబర్ 14న సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

కంగువా పార్ట్ 1 నవంబర్ 14న విడుదల కానుంది. దీని రిలీజ్‌కు ముందే కార్తిక్ సుబ్బరాజ్ సినిమాను పూర్తి చేసారు సూర్య. కంగువాపై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. అలాగే కార్తిక్ సుబ్బరాజ్‌తో గ్యాంగ్ స్టర్ డ్రామా చేస్తున్నారు సూర్య. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చివరి వర్క్ జరుపుకుంటుంది.అయితే ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కావాల్సి ఉండగా, రజినీకాంత్ "వెట్టయన్" విడుదల కారణంగా కంగువ విడుదల వాయిదా పడింది.

దీంతో కంగువాకు పూర్తి స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. మరి ఈ ఇష్యూని కంగువ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. జూలై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ సాంగ్ "ఫైర్ సాంగ్"ని చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.