
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోగా, సహాయ నటుడిగా అలరించినవారిలో సురేష్ ఒకరు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించి ఎంతో రిస్క్ చేశారు. అలాగే వైవిధ్యమైన పాత్రలు పోషించి సహయ నటుడిగా తనదైన ముద్ర వేశారు. చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సురేష్ మాట్లాడుతూ.. తాను కేవలం తన అప్పులు తీర్చుకోవడానికి మాత్రమే వరుస సినిమాలు చేశానని అన్నారు. కానీ కొన్నాళ్లకు సినిమాకు తాను ఏమిస్తున్నానని తనను తానే తిరిగి ప్రశ్నించుకున్నానని అన్నారు. ఆ సమయంలోనే తనకు సినిమాలపై నిజమైన ప్రేమ కలిగిందని అన్నారు. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో అద్భుతాలు చేసే దర్శకులంటే తనకు ఎంతో గౌరవమని సురేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో దర్శకుడు తేజ గురించి మాట్లాడుతూ కేవలం సుమారు 30 లక్షల రూపాయలతో ‘చిత్రం’ సినిమాను రూపొందించినప్పుడు తాను ఎంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. ఆ సినిమా చూశాక తేజను కౌగిలించుకుని అభినందించినట్లు గుర్తు చేసుకున్నారు. కళకు, డబ్బుకు సంబంధం లేదని, తక్కువ ఖర్చుతో కూడా గొప్ప సినిమాలు తీయొచ్చని తేజ నిరూపించారని ఆయన అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో చాలా స్పెషల్.. కలిసి నటించడం చాలా ఇష్టం.. నయనతార..
నటన అనేది కేవలం మనం ఏమి ఫీల్ అవుతున్నామో ఇతరులకు చూపించడం కాదు, మన అనుభూతిని ప్రేక్షకులు కూడా పొందేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. జయసుధ లాంటి గొప్ప నటీమణుల నుండి కళ్ళల్లో నీళ్ళు రాకుండానే భావోద్వేగాలను పండించడం ఎలాగో నేర్చుకున్నానని సురేష్ తెలిపారు. అతిగా నటించడం తనకు నచ్చదని, అందుకే రొమాంటిక్, కామెడీ, యాక్షన్ ఇలా ఏ పాత్ర చేసినా సహజంగా ఉండడానికే ప్రయత్నించానని చెప్పారు. సాధారణంగా డాన్స్ మాస్టర్లతో తనకు తరచుగా గొడవలు జరుగుతుండేవని ఆయన నవ్వుతూ చెప్పారు. కేవలం స్టెప్పులు వేయడం డాన్స్ కాదని, ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ చేసేదే అసలైన డాన్స్ అని తాను నమ్ముతానని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..
వన్ బీట్‌కి రెండు స్టెప్పులు వేసి డాన్సర్ అనిపించుకోవడం కన్నా, ఆ లయను అనుభవిస్తూ చేసే మూమెంట్స్ తనకు ఎంతో తృప్తినిస్తాయని వివరించారు. శివశంకర్ మాస్టర్ తన ఫేవరెట్ అని, ఆయన తనలోని సృజనాత్మకతను ప్రోత్సహించేవారని సురేష్ గుర్తు చేసుకున్నారు. డబ్బుల కోసం వచ్చిన తాను, క్రమంగా సినీరంగం పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్నానని వెల్లడించారు. పరిశ్రమ ఇచ్చే ప్రశంసలు, ఇక్కడ ఉండే మేక్ బిలీవ్ ప్రపంచం ఒకవైపు ఉన్నా, నిజమైన సంతృప్తి తిరిగి ఇవ్వడంలోనే ఉందని అన్నారు. ఈ ప్రేమతోనే మంచి స్క్రిప్ట్‌లను వినడం ప్రారంభించానని, ఒక మంచి పాయింట్‌ను ప్రేక్షకులకు చేరవేయాలనే తపనతో ఉన్నానని సురేష్ వివరించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా చేయడమే సావిత్రి తప్పు.. అక్కడే పతనం మొదలైంది.. సీనియర్ నటి జమున..