
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని నటుడు కళాభవన్ మణి. ఎన్నో చిత్రాల్లో ఆయన విలనిజంతో భయపెట్టాడు. విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించాడు. ఆయుధం, అర్జున్, నరసింహుడు, నగరం ఇలా అనేక చిత్రాల్లో నటించి మెప్పించాడు. తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా ప్లేబ్యాక్ సింగర్ గానూ రాణించాడు. మలయాళీ ఇండస్ట్రీలో జాతీయ అవార్డ్ అందుకున్న మొదటి నటుడు ఆయనే. కానీ ఆయన మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణం ఇప్పటికీ వీడని మిస్టరీ. మానసిక ఒత్తిడి, డిప్రెషన్ తో మధ్యానికి బానిసైన కళాభవన్ అనారోగ్యంతో మరణించాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గోన్న తమిళ్ నటుడు సురేష్ గోపి కళాభవన్ తో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
“మణిపై ఎప్పటికీ నా ప్రేమ మారదు. అతడితో నేను ఎప్పటికీ మర్చిపోలేని రెండు విషయాలు ఉన్నాయి. అరేబియన్ డ్రీమ్స్ షో కోసం దుబాయ్ వెళ్లినప్పుడు.. నా గది పెద్దగిగా ఉండేది. నా స్నేహితులందరితోపాటు అతడు కూడా నేలపై నిద్రపోయాడు. అది నాకు గొప్ప జ్ఞాపకం. అలాగే అతడి పెళ్లికి వెళ్లాను. అప్పుడు నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను కౌగిలించుకుని ఎమోషనల్ అయ్యారు. తన పెళ్లికి ఎవరూ రాలేదంటూ ఏడ్చాడు. మణి మొదటి సినిమాకు ఆటోలో వచ్చాడు. తనతోపాటు ఉన్న వ్యక్తిని నేనే. అక్షరం సినిమాలో తొలిసారి నటించాడు. తనతో ఉన్న క్షణాలు గుర్తొస్తే ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి ” అంటూ ఎమోషనల్ అయ్యారు సురేష్.
సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన మణి 2016లో రక్తం కక్కుకుని చనిపోయాడు. అతిగా మద్యం తాగడం వల్లే మరణించాడని అంతా అనుకున్నారు. కానీ ఫోరెన్సిక్ టెస్టులో పురుగుమందు ఆనవాళ్లు లభించడంతో అతడి మరణంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తెలుగులో చివరిసారిగా ఎవడైతే నాకేంటీ చిత్రంలో కనిపించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.