Sunil : మహేష్‌తో మాట్లాడటం.. జోకులు వేడయం అంత వీజీ కాదు అంటున్న సునీల్..

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నాడు మహేష్.

Sunil : మహేష్‌తో మాట్లాడటం.. జోకులు వేడయం అంత వీజీ కాదు అంటున్న సునీల్..
Sunil

Updated on: Dec 25, 2021 | 5:02 PM

Sunil : సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా అంతులేని అభిమానులను సొంతం చేసుకున్నాడు మహేష్. ప్రస్తుతం మహేష్ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక ఇప్పుడు మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. మహేష్ కు ఇటీవలే మోకాలికి సర్జరీ అయ్యింది. దాంతో మహేష్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. త్వరలోనే తిరిగి షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ దర్శకుల హీరో అని అందరు అంటుంటారు.. తాజాగా హీరో, కమెడియన్ సునీల్ మహేష్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

రీసెంట్ గా ఓ ఇంట్రవ్యూలో సునీల్ మాట్లాడుతూ..’మహేష్ తో కలిసి చాలా సినిమాలు చేసాను. ఆయన్ని చాలా దగ్గరగా చూసాను.. ఎంత అందంగా.. క్యూట్ గా ఉంటాడో సెట్‌లో అంతే సరదాగాను ఉంటారు అని అన్నారు. ఆయనతో ఫన్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది అన్నారు సునీల్. ఇక మహేష్  దర్శకుల్ని నమ్మి సినిమాలు చేస్తారు. దర్శకుడికి మాట ఇచ్చారంటే ఆ మాట కోసం నిలబడతాడని అన్నారు సునీల్. అంతే కాదు మహేష్ తో మాట్లాడటం..జోకులు వేడయం అంత వీజీ కాదు“ అని చెప్పుకొచ్చాడు సునీల్. ఇక మహేష్ యాక్షన్ సన్నివేశాల్లో వీలైనంత రియాల్టీ చూపించడానికి ప్రయత్నిస్తారు అని సునీల్ అన్నాడు. మహేష్ క్యూట్ గా..యంగ్ జేమ్స్ బాండ్ లా కనిపిస్తారు అని కితాబ్ ఇచ్చాడు సునీల్. ఇక సునీల్ ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా పుష్ప సినిమాలో నటించి ఆకట్టుకున్నారు సునీల్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Megastar Chiranjeevi: టికెట్స్ రేట్స్ పై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఏమన్నారంటే..

హీరోగా మారనున్న కాంగ్రెస్ కీలక నేత.. పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ ఎవరంటే…

Ghani: గని రిలీజ్ డేట్ వచ్చేసింది.. వరుణ్ తేజ్ సినిమా విడుదల ఎప్పుడంటే..