తిరుమల లడ్డూ వివాదంపై కీలక కామెంట్స్ చేశారు..యాక్టర్ సుమన్. లడ్డూ కల్తీ టెర్రరిజం కంటే పెద్ద నేరమన్న సుమన్..కల్తీ ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏ మతంలో అయినా ఇలాంటి తప్పులు జరగకూడదని..దీనిపై పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. రాజకీయం, పలుకుబడి ఉన్న వారిని కాకుండా..దేవుడి సేవలో ఉన్నవారినే దేవస్థానం బోర్డుల్లో నియమించాలన్నారు..సుమన్.
మరోవైపు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై ఇటీవల ప్రకాష్‌రాజ్‌తో జరిగిన సోషల్‌మీడియా ఫైట్‌పై స్పందించారు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. తన అభిప్రాయాన్ని చెప్పేందుకే తాను పోస్ట్ పెట్టానని..అందులో ఎలాంటి కాంట్రవర్సీ లేదని స్పష్టం చేశారు. ఒక హిందువుగా, తిరుపతి వాసిగా..లడ్డూ వివాదానికి మతం రంగు లేదని చెప్పగలన్నారు..విష్ణు.
దేవుడిపై నమ్మకంతో విషం తాగినా అమృతం లాగే ఉంటుందన్నారు..మంచు విష్ణు. తిరుమల లడ్డూ అంశం సున్నితమైనది కాబట్టే..నటీనటులు ఆచితూచి స్పందిస్తున్నారన్నారు. తమ అభిప్రాయం నచ్చనివాళ్లు యాక్టర్స్‌ని సులభంగా టార్గెట్ చేస్తారని చెప్పారు.
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్‌లో ఇటీవల పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన యాక్టర్ ప్రకాష్‌రాజ్..మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటనపై విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని..దీన్ని అనవసరంగా జాతీయస్థాయి అంశంగా మారుస్తున్నాని విమర్శించారు. ప్రకాష్‌రాజ్ పోస్ట్‌పై స్పందించిన మంచు విష్ణు.. మీ పరిధుల్లో మీరు ఉండాలంటూ ప్రకాష్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. ఈ వివాదానికి తన తాజా కామెంట్స్‌తో ముగింపు పలికే ప్రయత్నం చేశారు..విష్ణు. మరి విష్ణు కామెంట్స్‌పై ప్రకాష్‌రాజ్ ఏవిధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.