Sonu Sood: సోనూసూద్‌పై ఐటీ కన్నుపడింది. ముంబైలోని తన ఇల్లు, ఆఫీసు సహా 6 ప్రాంతాలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు లెక్కల అవకతవకలపై ఆరా తీశారు. అయితే ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడి చేయడంతో సోనూసూద్ షాక్ అయ్యారు. ఈ సోదాలపై అతడు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
48 ఏళ్ల నటుడు కరోనా సమయంలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేపట్టాడు. ముఖ్యంగా గత సంవత్సరం లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వలసదారుల కోసం ప్రత్యేక విమానాలను నిర్వహించి వారిని ఇళ్లకు పంపించాడు. సోను సూద్ మానవతావాదం వల్ల అనేక మంది అభిమానులను సంపాదించాడు. చాలామంది అతడి సాయంతో ఈ రోజు ఉపాధి పొందుతున్నారు. అతను రాజకీయాల్లో చేరడానికి ఎప్పుడూ మొగ్గు చూపలేదు కానీ ఆప్ అధినేతతో భేటీ తర్వాత ఊహాగానాలు చెలరేగాయి. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు.
ఇటీవల సోనూసూద్ విజయవాడ నగరంలో సందడి చేశారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంకుర హాస్పిటల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సోనూసూద్.. బెజవాడ పాలీక్లినిక్ రోడ్‌లోని అంకుర ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనూసూద్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో నగరవాసులు తరలి వచ్చారు. రియల్ హీరో సోనూసూద్ అని నినాదాలు చేశారు. అనంతరం ఇంద్రకీలాద్రిపై నెలవై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.