
కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని సామాన్య యువకుడు బుల్లితెరపై యాంకర్‌గా అడుగుపెట్టి ఇప్పుడు వెండితెరపై అగ్రకథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుసగా హిట్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. నటుడిగా, సింగర్‌గా ఫేమస్ అయ్యాడు. రెమో, ప్రిన్స్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు శివకార్తికేయన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈహీరో ఇప్పుడు తన అభిమానులతో శుభవార్త పంచుకున్నాడు. హీరో శివకార్తికేయన్, అతడి భార్య ఆర్తి తమ మూడవ బిడ్జకు స్వాగతం పలికినట్లు చెబుతూ స్పెషల్ నోట్ షేర్ చేశాడు.
“జూన్ 2న రాత్రి మాకు పండంటి మగబిడ్డకు స్వాగతం పలుకుతున్నప్పుడు మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగిపోయాయి. మా కుటుంబం ఇప్పుడు కొంచెం పెద్దది కావడం మాకు సంతోషంగా ఉంది. ఆర్తి, బాబు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మా మూడవ బిడ్డకు అక్క ఆరాధన, తమ్ముడు కుగన్లకు మరింత ప్రేమ, ఆశీర్వాదాలను అందించాలని కోరుకుంటున్నాము, మీ ప్రేమ, మద్దతు, ఆశీర్వాదాలు మాకు ఎప్పటికీ కావాలి” అంటూ నోట్ షేర్ చేశాడు. దీంతో శివకార్తికేయన్, ఆర్తి దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు, సినీ ప్రముఖులు.
శివకార్తికేయన్ తన బంధువు ఆర్తిని 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2013లో పాప ఆరాధన జన్మించగా.. 2021 బాబు కుగన్ జన్మించాడు. ఇప్పుడు 2024లో మరోసారి బాబు జన్మించాడు. ఇటీవల శివకార్తికేయన్ తన ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేయగా.. ఆర్తి మరోసారి ప్రెగ్నెంట్ అంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఈ వార్తలపై శివకార్తికేయన్ స్పందించలేదు. ఇప్పుడు మరోసారి బాబు జన్మించాడంటూ గుడ్ న్యూస్ పంచుకున్నాడు.
#BlessedWithBabyBoy ❤️❤️❤️ pic.twitter.com/LMEQc28bFY
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 3, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.