Siddharth: సిద్ధూ మనసులో అదిథి.. చెప్పకనే చెప్పేసిన హీరో.. మొత్తానికి అలా కన్ఫార్మ్ చేసేశాడా?..
డైరెక్టర్ కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించారు. ఈ సినిమా జూన్ 9న తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సిద్ధూ... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదురయ్యాయి. ముఖ్యంగా అదితితో ప్రేమాయణంపై ప్రశ్నలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఓపెన్ అయ్యారు సిద్ధార్థ్.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు సిద్ధార్థ్. ఒకప్పుడు ప్రేమకథా చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన హీరోలలో సిద్దూ ఒకరు. బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దాంటానా చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న హీరో. అయితే చాలా కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవలే మహా సముద్రం సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసిన సిద్ధూ.. ఇప్పుడు టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. డైరెక్టర్ కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించారు. ఈ సినిమా జూన్ 9న తెలుగుతోపాటు.. తమిళంలోనూ విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సిద్ధూ… తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలే ఎక్కువగా ఎదురయ్యాయి. ముఖ్యంగా అదితితో ప్రేమాయణంపై ప్రశ్నలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై ఓపెన్ అయ్యారు సిద్ధార్థ్.
ఇటీవలే బుల్లితెరపై ఓ షోలో పాల్గొన్న సిద్ధూకు మరోసారి ప్రేమకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీ జీవితాంతం తనతో కలిసి డాన్స్ చేయాలనుకునే ఆమె ఎవైరనా ఉన్నారా ? అని అడగ్గా… ఇందుకు సిద్ధూ స్పందిస్తూ.. మా ఊర్లో అందరూ అదితి దేవో భవ అంటారు కదా.. అంటూ నవ్వుతూ అన్నారు. దీంతో అతిథిని అదితి పేరుతో పిలవడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. మొత్తానికి తన మనసులో అదితి ఉన్న మాటను చెప్పకనే చెప్పేశాడు అంటున్నారు నెటిజన్స్.




చాలా రోజులుగా సిద్ధార్థ్, అదితి రావు హైదరీ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరు కలిసి రెస్టారెంట్స్, ఈవెంట్లకు వెళ్లడంతో ఆ వార్తలకు మరింత చేకూరింది. అయితే రూమర్స్ పై ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు. ఇటీవల అదితికి సైతం ఇదే ప్రశ్న ఎదురుకాగా ఆమె చిరునవ్వుగా సమాధానంగా ఇచ్చేసింది. ఇక ఇప్పుడు సిద్దూ మాటలతో మరోసారి వీరి ప్రేమాయణం గురించి వార్తలు వస్తున్నాయి.
Awwww did he just accept?? CUTE. ❤️❤️?#Siddharth pic.twitter.com/x9pVfv8SHT
— Shravani (@shravd05) June 9, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.