
నటుడు శత్రు, జూనియర్ ఎన్టీఆర్‌తో తన అనుభవాలను పంచుకుంటూ, ఆయన కేవలం గొప్ప నటుడు మాత్రమే కాదని, మంచి మానవతావాది అని ప్రశంసించారు. ఎన్టీఆర్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుందని, ఆయన నుంచి మంచి మనిషిగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చని శత్రు పేర్కొన్నారు. అరవింద సమేత చిత్రంలోని ఒక కీలక భావోద్వేగ సన్నివేశాన్ని శత్రు గుర్తు చేసుకున్నారు. స్టార్టింగ్ సీన్‌లో ఫైట్ అనంతరం తిరిగి వచ్చిన ఎన్టీఆర్, కారులో మరణించిన తన తండ్రిని చూసి, భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఏడ్చే తీరు తనను అబ్బురపరిచిందని తెలిపారు. ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు తాను షాక్ అయ్యానని, అంతటి అద్భుతమైన నటన తానెప్పుడూ చూడలేదని శత్రు వివరించారు.
Also Read: ఆ తెలుగు హీరో ఫోటోని రెండున్నరేళ్లు డీపీగా పెట్టుకున్న కార్తీ.. ఎందుకంటే
ఎన్టీఆర్ నటనా శైలిపై శత్రు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన సాధారణంగా నవ్వుతూ, మాట్లాడుకుంటూ, జోకులు వేసుకుంటూ ఉన్నప్పటికీ, షాట్ అనగానే క్షణాల్లో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటిస్తారని శత్రు అన్నారు. తాను అలా చేయలేనని, పాత్రలోకి వెళ్ళడానికి 10-15 నిమిషాల ప్రిపరేషన్ అవసరమని, కానీ ఎన్టీఆర్ తక్షణమే ఆ మూడ్‌లోకి వెళ్లిపోతారని వెల్లడించారు. జై లవకుశ చిత్రంలో తనకొక ప్రత్యేక అనుభవం ఎదురైందని శత్రు పంచుకున్నారు. ఆ సినిమాలో జై పాత్రకు ఎన్టీఆర్ చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారని, షూటింగ్ సెట్‌లోకి కూడా జై పాత్ర మూడ్‌లోనే వచ్చేవారని తెలిపారు. మార్నింగ్ సార్ అని పలకరించినా, ఎన్టీఆర్ మౌనంగా వెళ్లిపోవడం చూసి తాను ఏదైనా తప్పు చేశానా అని మొదట భావించానని శత్రు అన్నారు. అయితే, తర్వాత తనకు తెలిసింది ఎన్టీఆర్ ఆ రోజు జై క్యారెక్టర్ మూడ్‌లో ఉన్నారని. ఇది క్లైమాక్స్ సన్నివేశానికి సంబంధించిన మూడ్‌ను కొనసాగించడానికి అని, ఆ మూడ్‌ను డిస్టర్బ్ చేయకూడదని అప్పుడు అర్థమైందని శత్రు వివరించారు. ఇది ఎన్టీఆర్ పాత్ర పట్ల చూపిన డెడికేషన్, ప్రొఫెషనలిజాన్ని స్పష్టం చేస్తుందని శత్రు వెల్లడించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..