
Sarath Kumar : కరోనా మహమ్మారి మరో సారి విజేరంభిస్తుంది. సామాన్యులనుంచి సెలబ్రెటీలవరకు ఈ మహమ్మారి ఎవరిని వదిలిపెట్టడంలేదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరు కరోనా బారిన పడుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకునే సెలబ్రెటీలను కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కరోనా భారిన పడినవిషయం తెలిసిందే. సెలబ్రెటీలు సైతం కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా మరో నటుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. విలక్షణ నటుడు శరత్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోన రావడం ఇది రెండో సారి.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రియమైన స్నేహితులు, రాజకీయ పార్టీలోని సోదర, సోదరీమణులకు… నాకు కరోనా పాజిటివ్ అని ఈ సాయంత్రం తెలిసింది. ప్రస్తుతం నేను ఐసొలేషన్ లో ఉన్నా. నాతో గత వారం రోజుల్లో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి’ అని కోరారు. ఇదిలా ఉంటే శరత్ కుమార్ సతీమణి రాధికా శరత్ కుమార్, కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :