
చాలా గ్యాప్ తర్వాత సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తోన్న సినిమా సోదరా. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సంజోష్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సోదరా సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. హీరో సంపూర్ణేష్ బాబు కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన సినిమాను ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా చేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సంపూర్ణేష్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. సినిమాల్లో గ్యాప్ రావడం, తన ఆర్థిక పరిస్థితులపై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించాడు. ‘ హీరోగా 11 ఏళ్లు పూర్తి చేయడం నాకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ ప్రయాణం చాలా హ్యాపీగా అనిపిస్తోంది . సినిమాల కారణంగా నాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. అయితే ఆ క్రేజ్ ను ఎంజాయ్ చేయలేకపోయానని అప్పుడప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ నా భార్య ఉమారాణి మిషన్ కుడుతుంది. మాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరు బీటెక్ .. మరొకరు ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. నేను నటుడి అయినప్పటికీ వారు నరసింహాచారి పిల్లలుగానే సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకూ నా పేరును బయటికి రానీయరు. నాకు మాదిరిగానే బస్సులలో .. ఆటోలలో కూడా తిరుగుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే వాళ్లు అలా ఉండటమే నాకు కూడా నచ్చుతుంది’
‘నేను ఈ మధ్యన పెద్దగా సినిమాల్లో నటించడం లేదు. బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. ఈ కారణంగానే నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. నేను అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాననే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. నేను సినిమాలు చేశాను. అయితే అనుకున్న సమయానికి అవి రిలీజ్ కాకపోవడం వలన అలాంటి ప్రచారం జరిగింది. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు’ అని క్లారిటీ ఇచ్చాడు సంపూ.
From childhood fights to lifelong ❤ — this song hits where it matters. 👊#AnnanteyDostheySodara full video Song from #Sodara is out now on @adityamusic.
▶ https://t.co/TeROGAG7Mh#SodaraOnApril25th@actorsanjosh @sunilkashyapwav #SudhalaAshokTeja #YazinNizar #BalajiMangu pic.twitter.com/YtyVfR3Lwy
— Sampoornesh Babu (@sampoornesh) April 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.