టాలీవుడ్ యంగ్ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ్.. ఆ తర్వాత తన టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు. పిల్ల నువ్వు లేని జీవితం.. సూప్రీమ్ సినిమాలతో హిట్స్ అందుకున్న తేజ్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం విరూపాక్ష. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు పూర్తైన ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కాబోతుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తన జీవితంలో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
గత కొద్ది రోజులుగా తేజ్ పెళ్లి గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పెళ్లి గురించి తేజ్ మాట్లాడుతూ.. “ఎవరో అంటున్నారు కదా అని పెళ్లి ఇప్పుడే చేసుకోను. నాకు నచ్చినప్పుడే నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను ” అని అన్నారు. ఇక తన జీవితంలోనూ బ్రేకప్ జరిగిందని.. ఓ అమ్మాయిని ప్రేమించిన తర్వాత విడిపోయామని.. ఆ తర్వాత అమ్మాయిలు అంటేనే తనకు భయం వేస్తుందని.. బ్రేకప్ తర్వాత సైలెంట్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. విరూపాక్ష సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సంయుక్త.. సాయి ధరమ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.