ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాల్లోనే.. అప్పుడప్పుడు కనిపించే లిప్‌లాక్.. ఇప్పుడు మరీ కామన్ అయిపోయింది. అదో ప్రైవేటు పని.. బహిరంగంగా చేయకూడని పని దగ్గరి నుంచి.. ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసే ది బెస్ట్ వేగా మారిపోయింది. సినిమాల్లో ఎమోషన్ పండించేందుకు.. శృంగారాన్ని చూపించేందుకు.. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేందుకు.. లిప్ లాక్ సీన్లే ది బెస్ట్ అనే థాట్‌కు కూడా మేకర్స్ లో కలిగించేసింది. పనిలో పనిగా యూత్‌ను అట్రాక్ట్ చేయొచ్చనే మైండ్ సెట్ను వారిలో ఫిక్స్ అయిపోయేలా చేసేంది. అందుకే అన్నట్టు.. హాలీవుడ్ సినిమాల్లో కనిపించే ఈ సీన్లను.. మారిన కాలానికి అనుగుణంగా.. సినిమాల్లో సిచ్యూవేషన్స్ అండ్ మార్కటింగ్ ప్లాన్స్ ను బేస్ చేసుకుని మరీ.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు కొంత మంది మేకర్స్. అలా ఎంట్రీ ఇచ్చిన ఈ లిప్ లాక్ సీన్లకు సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ అండ్ అప్‌కమింగ్ హీల వరకు ప్రతీ ఒక్కరూ ఓకే చెబుతున్నారు. తమ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అలా తాజాగా మాస్ మహరాజ్ రవితేజ కూడా లిప్ లాక్ సీన్లకు వరుసగా ఓకే చెబుతూ.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు.
ఇక రవితేజ.. రమేష్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ‘ఖిలాడీ’ సినిమాతో లిప్ లాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో నటించిన ఇద్దరు హీరోయిన్లు.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిని లిప్ లాక్ చేశారు. లిప్ లాక్ చేయడమే కాదు.. థియేటర్లో తన మాస్ ఫ్యాన్స్ నుంచి దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టి.. సినిమాకు ప్లస్ అయ్యేలా చేశారు. టాలీవుడ్‌లో లిప్ లాక్ చేసిన హీరోల్లో ఒకరిగా నిలిచారు.
ఇక ఈ సినిమా తరువాత రవితేజ చేస్తున్న మరో సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ మండువ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రవితేజ ఓ పవర్ ఫుల్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రిలీజైన ట్రైలర్‌తో సినిమాపై విపరీతంగా అంచనాలు పెంచేశారు రవితేజ. పెంచేయడే కాదు..ట్రైలర్‌లోనే హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ని లిప్ లాక్ చేసి తన సినిమాల్లో లిప్ లాక్ లు ఇక కంటిన్యూ అనే హింట్‌ను తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కు ఇచ్చారు. ఈ లిప్ లాక్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు. వైరల్ అవ్వడమే కాదు.. సీరియల్ కిస్సర్ గా మారుతున్నారనే కామెంట్‌ను సోషల్ మీడియాలో రాబట్టుకున్నారు ఈ మాస్ మహ రాజా..!