Ravi Teja: తండ్రి చనిపోయిన రెండు రోజులకే సినిమా షూటింగ్‌కు! హీరో రవితేజ డెడికేషన్ పై ప్రశంసలు

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. అందులో మాస్ జాతర మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. దీంతో పాటు నేను శైలజ, చిత్రల హరి సినిమాల ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో RT76 (వర్కింగ్ టైటిల్) ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ.

Ravi Teja: తండ్రి చనిపోయిన రెండు రోజులకే సినిమా షూటింగ్‌కు! హీరో రవితేజ డెడికేషన్ పై ప్రశంసలు
Actor Ravi Teja

Updated on: Jul 21, 2025 | 10:45 AM

మాస్ మహారాజ రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు (90) ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన జులై 16న తుది శ్వాస విడిచారు. దీంతో రవితేజ కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ గోపీచంద్ మలినేని తదితర సినీ ప్రముఖులు రాజ గోపాల్ రాజు మృతికి నివాళులు అర్పించారు. అయితే తండ్రి మరణించి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే హీరో రవితేజ షూటింగ్ లో పాల్గొన్నాడట. ఇంకా ఎక్కువ గ్యాప్ ఇస్తే నిర్మాతలకు నష్టం చేకూరుతుందని ఆలోచించి, వెంటనే షూటింగ్ కు హాజరయ్యాడట మాస్ మహారాజ. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు రవితేజ డెడికేషన్ సూపర్బ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ మాస్ జాతర సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 27వ తేదీన రిలీజ్ మాస్ జాతర సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పాటు తిరుమల దర్శకత్వంలో RT76 సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుంది. సంక్రాంతికి రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మాస్ జాతర సినిమాలో రవితేజ, శ్రీలల..

ఈ క్రమంలో ఇప్పటికే మొదలు పెట్టిన షూటింగ్ షెడ్యూల్ మధ్యలో చనిపోయారు రవితేజ తండ్రి. దాంతో షూటింగ్ కి రెండు రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చారు మాస్ మహారాజా. ఇంకా ఎక్కువ గ్యాప్ ఇస్తే నిర్మాతలకు నష్టం చేకూరుతుందని ఆలోచించిన ఆయన తండ్రి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ లకు హాజరవుతున్నాడట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..