AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rana Daggubati: చావు అంచుల దాకా వెళ్లా.. ఇక నా కథలన్నీ ఆ హీరోకు ఇవ్వాలా?అనిపించింది.. రానా ఎమోషనల్ కామెంట్స్

గతంలో హీరో రానా దగ్గుబాటి ఆరోగ్యంపై చాలా రూమర్లు వచ్చాయి. ముఖ్యంగా బాహుబలి 2 రిలీజ్ తర్వాత ఈ 'టాలీవుడ్ హల్క్' హెల్త్ కండిషన్ పై నెట్టింట లేని పోని పుకార్లు వినిపించాయి. కొన్ని రోజుల క్రితం ఇదే విషయంపై ఓపెన్ గా మాట్లాడాడు రానా.

Rana Daggubati: చావు అంచుల దాకా వెళ్లా.. ఇక నా కథలన్నీ ఆ హీరోకు ఇవ్వాలా?అనిపించింది.. రానా ఎమోషనల్ కామెంట్స్
Actor Rana Daggubati
Basha Shek
|

Updated on: Oct 27, 2026 | 8:25 PM

Share

మూవీ మొఘల్ డి.రామానాయుడు మనవడిగా, స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు కుమారుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టాడు రానా దగ్గుబాటి. లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ దగ్గుబాటి హీరో నేను నా రాక్షసి, కృష్ణం వందే జగద్గురుమ్, రుద్రమ దేవి, నేనే రాజు నేనే మంత్రి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘ బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలోనూ ఫేమస్ అయిపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అందులో ఆయన పోషించిన భళ్లాల దేవ రోల్ రానా క్రేజ్ ను అమాంతం పెంచేసింది. దీని తర్వాత కూడా అరణ్య, 1945, విరాట పర్వం తదితర సినిమాల్లో యాక్ట్ చేశాడు రానా. అయితే ఈ మధ్యన హీరోగా కంటే నిర్మాతగానే ఎక్కువగా బిజీగా ఉంటున్నాడు రానా. ముఖ్యంగా మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు అండగా నిలుస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ కొన్నేళ్ల క్రితం రానా ఆరోగ్యంపై పలు రుమార్లు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఇదే విషయంపై మాట్లాడిన ఈ దగ్గుబాటి హీరో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు

‘కిడ్నీ సమస్యలు తీవ్ర రూపం దాల్చడంతో శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో నా ముందున్న ఏకైక లక్ష్యం ‘బతకడం’ మాత్రమే. సినిమా కెరీర్‌ లేదా ఇమేజ్‌ గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. దాదాపు ఏడాది పాటు అమెరికాలో ఉండి చికిత్స తీసుకున్నాను. ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చేశాను. అప్పుడు నా శరీరంలో వచ్చిన మార్పులు చూసి నేనే ఆశ్చర్యపోయాను. అద్దంలో చూసుకుంటే నన్ను నేను గుర్తు పట్టలేకపోయాను. అనారోగ్య సమయంలో నా మానసిక స్థితి కూడా పూర్తిగా మారిపోయింది. ‘నేనెవరు?’ అనే ప్రశ్నకు సమాధానం అదే దశలో దొరికింది. అప్పటి నుంచి జీవితాన్ని కొత్త దృష్టితో చూడడం అలవాటు చేసుకున్నా. ఆపరేషన్‌కు కారణంగా ముందు అంగీకరించిన కొన్ని భారీ ప్రాజెక్టులను కూడా వదులుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఒక రెజ్లర్‌ కథతో తెరకెక్కాల్సిన సినిమా కోసం సంతకం చేసినప్పటికీ, నా శారీరక స్థితి ఆ పాత్రకు సరిపోదని భావించి నిర్మాతలకు తీసుకున్న అడ్వాన్స్‌లను తిరిగి ఇచ్చేశాను.

‘నేను అనారోగ్య సమయంలో వరుణ్‌ నన్ను పరామర్శించడానికి వచ్చాడు. అతడిని చూస్తుంటే పాత రానా కనిపించినట్లు అనిపించింది. నేను ఉండాల్సిన రూపంలో అతడు ఉన్నాడు. నా కథలన్నీ అతడికే ఇచ్చేయాలా? అని కూడా ఒక క్షణం అనిపించింది’ అని రానా చెప్పిన మాటలు అభిమానులను కదిలిస్తున్నాయి. ప్రస్తుతం ఈ టాలీవుడ్ హల్క్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఈ మధ్యన హీరోగా కంటే నిర్మాతగానే ఎక్కువగా కనిపిస్తున్నారు రానా దగ్గుబాటి. అలాగే వివిధ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషిస్తూ, కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. అలాగేఅప్పుడప్పుడు బుల్లితెరపైనా హోస్ట్ గానూ సందడి చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us