నటకిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అనుకోని ప్రయాణం. ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత డా.జగన్ మోహన్ డి వై నిర్మిస్తున్న ఈ సినిమాలో నరసింహ రాజు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ అందించడం మరో విశేషం. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “నలఫై ఏళ్ళ సినీ ప్రయాణంలో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి కొన్ని కథలు విన్నప్పుడు షాకైనమాటే వాస్తవామే. కానీ దర్శకుడు వెంకటేష్ ‘అనుకోని ప్రయాణం’ కథ చెప్పినపుడు ఫ్రీజ్ అయ్యాను. 45ఏళ్ళ తర్వాత మళ్ళీ గొప్ప సినిమా చేస్తున్నాననే భావన కలిగింది. కరోనా సమయంలో వలస కూలీలు ప్రయాణం నుండి పుట్టిన కథ ఇది. ప్రేక్షకుల మనసుని ఆకట్టుకునే గొప్ప కథ. జగన్ మోహన్ లవ్లీ ప్రొడ్యుసర్. ఇలాంటి సినిమా తీయడం నిర్మాత ప్యాషన్ వల్లే సాధ్యమౌతుంది. సినిమా కథని ప్రేమించిన నిర్మాత. ‘అనుకోని ప్రయాణం’ లో ఇద్దరి స్నేహితుల కథ. ఇందులో గ్రేట్ ఫ్రండ్షిప్ చూస్తారు. నరసింహరాజు గారు లాంటి గొప్ప నటుడితో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది ” అన్నారు.