AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajendra Prasad: ఆ హీరో నాకు 14 సినిమాలు ఇప్పించారు.. ఆయన రుణం తీర్చుకోలేను.. నటుడు రాజేంద్ర ప్రసాద్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'నటకిరీటి', 'హాస్య కిరీటి' గా సుపరిచితులైన రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటనతో, టైమింగ్‌తో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. 1980, 90ల కాలంలో టాలీవుడ్‌లో కామెడీ చిత్రాలకు సరికొత్త అర్థాన్ని ఇచ్చి, కమర్షియల్ హీరోగా తనదైన ముద్ర వేశారు. ఇప్పటికీ వరుస సినిమాలతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.

Rajendra Prasad: ఆ హీరో నాకు 14 సినిమాలు ఇప్పించారు.. ఆయన రుణం తీర్చుకోలేను.. నటుడు రాజేంద్ర ప్రసాద్..
Rajendra Prasad
Rajitha Chanti
|

Updated on: Jun 06, 2026 | 2:03 PM

Share

సినీ రంగంలో తన సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన అనేక మలుపులను, ముఖ్యంగా తన కెరీర్ ప్రారంభంలో సూపర్ స్టార్ కృష్ణ తనపై చూపిన ప్రభావాన్ని నటుడు రాజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో వివరించారు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రస్తావన వస్తూ మహేష్ బాబు కామెడీ టైమింగ్ గురించి అనిల్ రావిపూడి చెప్పిన విషయాలు పంచుకున్న తర్వాత, రాజేంద్ర ప్రసాద్ తన సినీ జీవితంలో కృష్ణతో తనకున్న అనుబంధాన్ని వెల్లడించారు. తన కెరీర్ రామలయంలో భీమరాజు అనే సినిమాతో మొదలైందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆ చిత్రంలో తాను రావు గోపాల్ రావు కొడుకుగా, అంటే విలన్ కొడుకు పాత్రలో నటించానని పేర్కొన్నారు. తన మొదటి షాట్ ఒక పెళ్లి సీను అని, ఆ సీన్లో శ్రీదేవితో తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చూపించారని వివరించారు. ఆ సమయంలో సెట్‌లో కృష్ణ, సత్యనారాయణ , జగ్గయ్య , చంద్రమోహన్ వంటి దిగ్గజ నటులతో పాటు మొత్తం 23 మంది ఆర్టిస్టులు ఉన్నారని రాజేంద్ర ప్రసాద్ గుర్తుచేసుకున్నారు. అటువంటి భారీ సెట్‌లో, అంత మంది సీనియర్ నటుల మధ్యలో తన మొదటి షాట్‌కు నటించడం గొప్ప అనుభవమని ఆయన అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో అద్భుతమైన వ్యక్తి.. వయసులో చిన్నోడైనా చేతులెత్తి నమస్కరిస్తున్నా..

ఆ పెళ్లి సీను మధ్యలో సూపర్ స్టార్ కృష్ణ తన చెవిలో వచ్చి, “ఒరేయ్ నువ్వే తాళి కడతావా, అక్కడ చూడు కత్తులు లేస్తున్నాయి” అని సరదాగా భయపెట్టారని రాజేంద్ర ప్రసాద్ వివరించారు. ఆ సమయంలో కృష్ణ చూపిన చొరవ, ఆయన గమ్మత్తుగా చెప్పిన మాటలు తనలో సహజమైన భయాన్ని కలిగించాయని తెలిపారు. ఆ భయానికి తాను ఇచ్చిన రియాక్షన్ చూసి కృష్ణ ఎంతో సంతోషించారని, ఆయన ఒక మహానుభావుడని రాజేంద్ర ప్రసాద్ ప్రశంసించారు. ఆ ఒక్క షాట్ యాక్ట్ చేసి బయటకు వెళ్లి కూర్చుని ఉండగా, కృష్ణ అక్కడ ఉన్న దర్శకులను తన వైపు దృష్టి మళ్ళించారని రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam : చివరి రోజుల్లో ఎంఎస్ నారాయణ కోరిన ఆఖరి కోరిక అదే.. హాస్పిటల్ బెడ్ మీద అలా చూశాక.. బ్రహ్మానందం ఎమోషనల్..

కె.బాపయ్య, రాఘవేంద్ర వంటి ప్రముఖ దర్శకులు రాజేంద్ర ప్రసాద్ నటనను చూడటానికని అక్కడికి వస్తే, కృష్ణగారు వారిని ఉద్దేశించి, “ఏయ్ ఈ కుర్రాడు భలే యాక్ట్ చేస్తున్నాడు. బాపయ్య మన సినిమాలో బావమరిది ఎవరో నాకు,” అని తనను సిఫార్సు చేశారని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కృష్ణ ప్రోత్సాహం, ఆయన ప్రశంసల ఫలితంగా, అక్కడికక్కడే తనకు 14 సినిమాలు బుక్ అయ్యాయని రాజేంద్ర ప్రసాద్ ఆశ్చర్యంగా, కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ చూపిన ఆ మద్దతు, చొరవ తన సినీ కెరీర్‌కు పునాది వేసిందని, అప్పటి నుంచి తనకు వరుసగా అవకాశాలు వచ్చాయని రాజేంద్ర ప్రసాద్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కృష్ణ కేవలం ఒక గొప్ప నటుడు మాత్రమే కాదని, తోటి నటులను ప్రోత్సహించే గొప్ప మనసున్న వ్యక్తి అని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : Meenakshi Chaudhary : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. ఎప్పటికైన అతడితో ‏డేట్‏కు వెళ్తాను.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

Follow Us