Raj Tarun: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య.. మధ్యలో హీరోయిన్.. ప్రేమకథలో ఎన్నో ట్విస్టులు..

రాజ్‌ తరుణ్‌ వర్సెస్‌ లావణ్య..మద్యలో మాల్వీ మల్హోత్రా. ట్రయాంగిల్‌ రిలేషన్‌ షిఫ్‌ ఎపిసోడ్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్‌ తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్‌తరుణ్‌ తను 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నారు.

Raj Tarun: రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య.. మధ్యలో హీరోయిన్.. ప్రేమకథలో ఎన్నో ట్విస్టులు..
Hero Rajtarun Lavanya
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 05, 2024 | 9:51 PM

రాజ్‌ తరుణ్‌ వర్సెస్‌ లావణ్య..మద్యలో మాల్వీ మల్హోత్రా. ట్రయాంగిల్‌ రిలేషన్‌ షిఫ్‌ ఎపిసోడ్‌ ఇప్పుడు సంచలనంగా మారింది. రాజ్‌ తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్‌తరుణ్‌ తను 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామన్నారు. కానీ ..ఇప్పుడు మాల్వీ మల్హోత్ర అనే యువతి మోజులో పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని రాజ్‌తరుణ్‌పై కంప్లేంట్‌ చేసింది. ఈ రిలేషన్‌ షిప్‌ వివాదంలో ఎన్నో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. మాల్వీ మల్హోత్ర అండ్‌ ఫ్యామిలీ తనను రాజ్‌ తరుణ్‌కు దూరం చేయాలని చూస్తున్నారని లావణ్య తన కంప్లేంట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు మాల్వీ మల్హోత్ర ఆమె బంధువులు తనను బెదిరిస్తున్నారని..తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాల్వీ మల్హోత్ర – రాజ్‌తరుణ్‌ ఇద్దరూ తిరుగబడరస్వామిలో కలిసి నటించారు.

లావణ్య తన కంప్లేంట్‌లో మాల్వీ మల్హోత్రతో పాటు ఆమె కుటుంబసభ్యులపై కూడా ఫిర్యాదు చేశారు. రాజ్‌ తరుణ్‌కు తాను దూరం కావాలని వాళ్లు బెదిరిస్తున్నారని వాపోయారామె. రాజ్‌తరుణ్‌ లేకపోతే తాను ఉండలేననీ.. అతనితోనే కలసి బతకాలని కోరుకుంటున్నట్టు కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా లావణ్య కంప్లేంట్‌ తెరపైకి రాగానే అలా రాజ్‌ తరుణ్‌ తన వెర్షన్‌ విన్పించారు. సహజీవనం నిజమే. కానీ అది ఒన్స్‌ అపానే టైమ్‌. ఇప్పుడు తను మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉందని.. డబ్బు కోసం తనను బ్లాక్‌ మెయిలింగ్‌ చేస్తుందని ఆరోపించారు. ఈ ట్రయాంగిల్ ప్రేమకథలో సినిమాకు మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి.

మాల్వీ మల్హోత్రతో ఎఫైర్‌ కారణంగానే రాజ్‌తరుణ్‌ తనను పక్కనబెట్టాడనీ లావణ్య అంటోంది. తిరగబడరా సామీ మూవీ షూటింగ్‌కు ముందు నుంచే వాళ్లిద్దరి మధ్య ఎఫైర్‌ ఉందని.. ఆమెను కలవడానికి రాజ్‌ తరుణ్‌ ముంబై వెళ్లి వచ్చేడాన అంటుంది లావణ్య. అంతేకాదు, హిమాచల్‌ ప్రదేశ్‌ CM తకు ఫ్యామీలీ ఫ్రెండ్‌ అని తాము తలచుకుంటే ఏమైనా చేయగలమని మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ తనను బెదిరించినట్లు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంది లావణ్య. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య డిఫరెనెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. లావణ్య ఆరోపణలపై స్పందించిన రాజ్ తరుణ్.. తమ సహజీవనం నిజమే కానీ ఇప్పుడు లావణ్య మరొకరితో రిలేషన్‌ షిప్‌లో ఉందన్నారు రాజ్‌ తరుణ్‌.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.