నాకోసమే ఆయన సినిమా చూస్తా అన్నారు.. అది జీవితంలో మర్చిపోలేను: రఘుబాబు

ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు రఘుబాబు. ప్రముఖ నటుడు గిరిబాబు కొడుకు రఘుబాబు. తండ్రి కొడుకులు ఇద్దరూ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు రఘుబాబు. చాలా సినిమాల్లో ఆయన కీలక పాత్రల్లో నటించారు.

నాకోసమే ఆయన సినిమా చూస్తా అన్నారు.. అది జీవితంలో మర్చిపోలేను: రఘుబాబు
Raghu Babu

Updated on: Mar 08, 2026 | 12:47 PM

విలన్ గా కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నటుడు రఘుబాబు. ఎన్నో విలక్షణ పాత్రలు చేసి అభిమానులను సొంతం చేసుకున్నారు. ఎంతో మంది హీరోలతో కలిసి సినిమాలు చేసిన రఘుబాబు ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు, ఇటీవలే వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మేపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రఘుబాబు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రఘుబాబు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి వివరించారు. ఆయన తండ్రి, సీనియర్ నటులు గిరిబాబు గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ రఘుబాబు ఇన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, తన వృత్తి పట్ల అంకితభావంతో ముందుకు సాగుతున్నారు రఘుబాబు.

తన కెరీర్‌లో బన్నీ సినిమా ఒక మైలురాయి అని రఘుబాబు తెలిపారు. ఈ చిత్రంలో తన పాత్రకు విశేష ప్రశంసలు లభించాయని, కొందరు తన పాత్ర కోసమే సినిమాను మళ్ళీ చూశారని గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా 100 రోజుల వేడుకలో జరిగిన సంఘటనను ఆయన ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నారు. ఆ రోజు వేదికపై చాలా మంది మాట్లాడినా, ఎవరూ తన గురించి ప్రత్యేకంగా చెప్పలేదని, అప్పుడు నాగబాబు తన గురించి మాట్లాడమని వెనుక కూర్చుని అడిగారని అన్నారు. చివరిగా మైక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి, “నేను ఇంకోసారి సినిమా చూడాలంటే అది మా బన్నీ కోసం కాదు, మా రఘు కోసం చూస్తాను” అని చెప్పడం తన జీవితంలో లభించిన గొప్ప ప్రశంసగా రఘుబాబు అన్నారు. ఈ మాట తన కెరీర్‌కు ఊహించని మైలేజీని ఇచ్చిందని, అది అద్భుతమైన ప్లస్ పాయింట్ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

చిరంజీవి గొప్ప మనసును, ఆయన ప్రోత్సాహాన్ని రఘుబాబు ఎంతగానో కొనియాడారు. చిరంజీవి ఎవరిలో ఏ మాత్రం ప్రతిభ ఉన్నా వెంటనే గుర్తించి ప్రోత్సహిస్తారని, ఫోన్ చేసి పిలిచి మాట్లాడతారని చెప్పారు. చిరంజీవి ప్రశంసించడం అంటే మొత్తం సినీ పరిశ్రమ అంతా చేసినట్టేనని, ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు సోల్ పవర్, ఇంజిన్ లాంటి వారని రఘుబాబు అన్నారు. ఆయన ప్రతీ సంవత్సరం చిరంజీవి పుట్టినరోజుకు, జనవరి 1న వెళ్లి కలుస్తానని, ఆశీస్సులు తీసుకుంటానని తమ అనుబంధాన్ని తెలిపారు రఘుబాబు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us