Prudhvi Raj: ‘వారిపై పరువు నష్టం దావా వేస్తా’.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పృథ్వీరాజ్

లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన '150 మేకల్లో చివరకు 11' కామెంట్స్ దుమారం రేపాయి. దీంతో నటుడు పృథ్వీపై వైస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అతను వెంటనే క్షమాపణలు చెప్పాలని లేకుండా సినిమాను బాయ్ కాట్ చేస్తామని డిమాండ్ చేస్తున్నాయి.

Prudhvi Raj: వారిపై పరువు నష్టం దావా వేస్తా.. సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించిన పృథ్వీరాజ్
Actor Prudhvi Raj

Updated on: Feb 12, 2025 | 8:17 PM

విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రి రీలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీ చేసిన కామెంట్స్ పై వైఎస్సార్ సీపీ భగ్గుమంటోంది. పృథ్వీ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా #BoycotLaila ట్రెండ్ చేస్తోంది. ఇదే క్రమంలో నటుడు పృథ్వీ ఆస్పత్రిలో చేరడం చర్చనీయాంశమైంది. తాజాగా ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత రెండు రోజులుగా వైఎస్సార్ సీపీ సోషల్‌ మీడియా వింగ్‌ తనను మానసికంగా వేధిస్తోందని పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులతో వచ్చిపోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘ఫోన్‌కాల్స్‌, మెస్సేజ్‌లతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నా నెంబర్‌ సోషల్‌ మీడియా గ్రూప్‌లో ఉంచి 1800 కాల్స్‌ చేయించారు. మా అమ్మ, భార్య, పిల్లలను దారుణంగా తిట్టిస్తున్నారు. వారి వేధింపులు తాళలేక ఆసుపత్రిలో చేరాను. అనిల్‌ పేరుతో పోస్టులు పెట్టిన వ్యక్తిపై ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. త్వరలో ఈ విషయంపై ఏపీ హోంమంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తాను. నన్ను ఇలా మానసికంగా వేధించిన వారిపై కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేస్తాం’ అని పృథ్వీరాజ్ మీడియాతో తెలిపారు.

విశ్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు రామ్‌ నారాయణ్‌ తెరకెక్కించిన చిత్రమే ‘లైలా’. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌. ఇందులో పృథ్వీ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవలే హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగానే పృథ్వీ చేసిన పొలిటికల్ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో పృథ్వీరాజ్.. వీడియో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి