నోరు జారితే..సినిమా ఛాన్స్ మిస్సే!

|

Jun 19, 2019 | 2:31 PM

కమెడియన్ పృథ్వీ..ఈ పేరు కంటే వైసీపీ నేత పృథ్వీ.. ఇలా చెబితేనే ప్రస్తుతం జనాలు గుర్తుపడతారేమో. ప్రస్తుతం వైసీపీలో అంత యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ఈ సినీ నటుడు. గత ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ..ప్రత్యర్థి పార్టీలపై కాస్త ఘాటుగానే విమర్శలు చేసారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఇక అధికారంలోకి వచ్చాక సీనీ ఇండస్ట్రీకి జగన్ అవసరం లేదా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవిపై […]

నోరు జారితే..సినిమా ఛాన్స్ మిస్సే!
Follow us on

కమెడియన్ పృథ్వీ..ఈ పేరు కంటే వైసీపీ నేత పృథ్వీ.. ఇలా చెబితేనే ప్రస్తుతం జనాలు గుర్తుపడతారేమో. ప్రస్తుతం వైసీపీలో అంత యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు ఈ సినీ నటుడు. గత ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం చేసిన పృథ్వీ..ప్రత్యర్థి పార్టీలపై కాస్త ఘాటుగానే విమర్శలు చేసారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఇక అధికారంలోకి వచ్చాక సీనీ ఇండస్ట్రీకి జగన్ అవసరం లేదా అంటూ విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా నోరు పారేసుకున్నారు.

ఐతే పవన్, చిరంజీవిలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మెగా ఫ్యామిలీ హీరోలు..పృథ్వీ పై సీరియస్‌గా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అందుకే అల్లు అర్జున్, త్రివిక్రమ్  కాంబినేషన్లో తెరకెెక్కుతున్న సినిమాలో పృథ్వీని తప్పించారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి త్రివిక్రమ్ కూడా ఓకే చెప్పారని పృథ్వి ప్లేస్‌లో మరో నటుడితో భర్తీ చెయ్యాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. ఈ విషయమై పృథ్వీ తాజాగా స్పదించారు.

తనకు పవన్ తో విభేదాలు లేవని..అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాలో నాకు ఆఫర్ వున్న సంగతి కూడా  తనకి తెలియదన్నాడు. అలాంటిది నన్ను ఈ సినిమాలో ఎలా తీసేస్తారని ఎదురు ప్రశ్నించాడు. అత్తారింటికి దారేది తర్వాత నేను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను కలవలేదని, నాకు ఆయన వేషం ఇస్తా అనికూడా చెప్పలేదన్నారు. ఇక మెగా ఫ్యామిలీ అంటే నాకు ఎప్పటికి గౌరవం ఉంటుంది అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రాజకీయంగా ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. వాటిని సినీరంగానికి, కళాకారులకు ఆపాదించకూడదన్నారు.