దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ (Prabhas) కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని సమయాల్లో తనకు అండగా ఉన్న పెద్దనాన్న అకాల మరణంతో ప్రభాస్ తీవ్ర దుఃఖంలో ఉండిపోయారు. కృష్ణంరాజు నట వారసుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్.. అతి తక్కువ సమయంలోనే యంగ్ రెబల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ క్రేజ్ చూసి కృష్ణంరాజు సైతం ఎన్నోసార్లు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. నటనలో… స్టైల్లోనూ.. కృష్ణంరాజుకు ఏమాత్రం తీసిపోరు ప్రభాస్. తాజాగా డార్లింగ్ అభిమానులు సైతం ఈ విషయాన్ని నిరూపించారు. కృష్ణంరాజు, ప్రభాస్ చిత్రాల్లోని పలు సన్నివేశాలను జత చేస్తూ ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించారు ఫ్యాన్స్. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాజాగా అదే వీడియోను ప్రభాస్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. హార్ట్ సింబల్‍తోపాటు.. దండం పెడుతున్న ఏమోజీని షేర్ చేస్తూ.. తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆ వీడియోలో ప్రభాస్, కృష్ణంరాజు ఎక్స్ప్రెషన్స్ నుంచి వారిద్దరి యాక్షన్ సన్నివేశాలు.. సాంగ్స్.. వరకు అన్ని సీన్స్ ఓకేలా ఉన్నాయి. అంతేకాకుండా.. వారి సీన్స్‌కు తగినట్టుగా బ్యాగ్రౌండ్లో ప్రభాస్ నటించిన సినిమాల సాంగ్స్ మరింత హైలెట్‌గా నిలిచింది. కృష్ణంరాజు మరణం తర్వాత తొలిసారి ప్రభాస్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేయడంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. కృష్ణం రాజు దాదాపు 183 చిత్రాల్లో నటించి మెప్పించారు. అంతేకాకుండా.. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన బిల్లా, రాధేశ్యామ్ వంటి చిత్రాల్లో కీలకపాత్రలలో కనిపించారు. ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆదిపురుష్ షూటింగ్ కంప్లీట్ కాగా.. సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇక ప్రభాస్ సొంత గ్రామం మొగల్తూరులో ఈనెల 29న కృష్ణంరాజు స్మారక సభ నిర్వహించనున్నారు. ఈ సభను పెద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభ కోసం 70 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారట.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.