Anchor Shyamala: హంస వాహనంపై యువరాణిలా యాంకర్ శ్యామల.. చూసేందుకు 2 కళ్లు చాలట్లే
ఏవరీ యువరాణి.. అచ్చం మన తెలుగు యాంకర్ శ్యామలలా ఉందని ఆశ్చర్యపోకండి. ఆమె మన శ్యామలే. ఈ సెటప్ వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం పదండి.
Tollywood: డియర్ హైనెస్.. ఏ రాజ్యం మీది అంటారు మీరు ఈ వీడియో చూస్తే. అవును.. యాంకర్ శ్యామల హంస పల్లకిపై అలా వస్తుంటే.. కళ్లు కూడా ఆర్పాలనిపించదు. ఆమె హీరోయిన్ మెటిరీయల్ కానీ టైమ్ బాలేక.. బుల్లితెరపైనే ఉండిపోయింది. వెండితెరపై అప్పుడప్పుడు చిన్న పాత్రల్లో మెరుస్తుంది. ముద్దు.. ముద్దు మాటలతో బుల్లితెరపై మాయ చేసే ఈ చిన్నది.. అలా హంస పల్లకిపై వస్తుంటే మతిపోతుంది అంటున్నారు నెటిజన్స్. వివరాల్లోకి వెళ్తే.. తనకు ఎప్పట్నుంచో ఉన్న ఓ కోరికను తీర్చుకుంది శ్యామల. యాంకర్ శ్యామలది లవ్ మ్యారేజ్. యాక్టర్ నర్సింహ రెడ్డితో ఆమె దాంపత్య జీవితం హ్యాపీగా సాగుతుంది. ఈ కపుల్‌కు ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే పెళ్లి సమయంలో.. పెళ్లి కుమార్తెగా అందంగా ముస్తాబై.. పల్లకిలో వెళ్లాలన్నది ఆమె కోరిక అట. అయితే అప్పటి పరిస్థితుల వల్ల ఆమె కోరిక నెరవేరలేదు. అయితే తాజాగా తన మనసులోని కోరికను తీర్చుకుంది శ్యామల. హంస వాహనం డిజైన్‌లో ఉన్న పల్లకిలో కూర్చుని యువరాణిలా ఊరేగింపుగా వచ్చింది. నలుగురు వ్యక్తులు పల్లకి మోసుకుంటూ రాగా.. దాని ముందు కొందరు డ్యాన్స్ చేస్తూ వచ్చారు. ఆమె వచ్చేదారికి రెండు వైపులా బారికేడ్లు పెట్టారు. జనాలు భారీ ఎత్తున వచ్చారు. బౌన్సర్లు జనాల్ని కంట్రోల్ చేస్తున్నారు. పోలీసులు సైతం అక్కడికి వచ్చారు. శ్యామల ఈ వీడియోని ఇన్ స్టాలో షేర్ చేయగా.. అది ప్రజంట్ ఫుల్ వైరల్ అవుతుంది. మొత్తానికి ఇలా తన మనసులోని కోరికని తీర్చుకుంది శ్యామల.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.