AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : స్టార్ హీరో కావాల్సినోడు.. ఒక్క రాత్రితో జీవితం ముగిసిపోయింది.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..

తెలుగు సినీ రంగుల ప్రపంచంలో జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఊహించలేము. ఎన్నో కలలతో సినీరంగంలోకి అడుగుపెట్టిన తరాలు.. అనుహ్యంగా ఫేడౌట్ అయిపోతుంటారు. మరికొందరు కెరీర్ పీక్స్ లో ఉండగానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకరు.

Tollywood : స్టార్ హీరో కావాల్సినోడు.. ఒక్క రాత్రితో జీవితం ముగిసిపోయింది.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..
Pingpong Surya
Rajitha Chanti
|

Updated on: May 31, 2026 | 9:36 AM

Share

మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో యశో సాగర్ గుర్తున్నాడా.. ? 2008లో విడుదలైన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఫస్ట్ మూవీతో లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ సినిమాలో స్నేహా ఉల్లాల్ సరసన నటించి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో స్టార్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు, తన 23వ ఏట డిసెంబర్ 25, 2012న జరిగిన రోడ్డు ప్రమాదంలో యశో సాగర్ మరణించారు. పూణే నుండి బెంగళూరుకు కారులో వస్తుండగా, కర్ణాటకలోని తుమకూరు జిల్లా శిరా సమీపంలో కారు అదుపుతప్పి వంతెనను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనతో పాటు ఆయన స్నేహితుడు విశ్వనాథ్ రెడ్డి కూడా అక్కడికక్కడే మరణించారు. మరణించే సమయంలో ఆయన ‘మిస్టర్ ప్రేమికుడు’ అనే తన రెండవ సినిమా షూటింగ్‌లో ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

తాజాగా టాలీవుడ్ నటుడు పింగ్‌పాంగ్ సూర్య ఓ ఇంటర్వ్యూలో యశో సాగర్‌తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. యశో సాగర్ చాలా మంచి వ్యక్తి అని, అతనికి ఎలాంటి చెడు అలవాట్లు లేవని అన్నారు. షూటింగ్ రాయచూర్‌లో జరిగిందని, అక్కడ ఒక పవర్ ప్లాంట్ కాలనీలో కాఫీ డే సెట్ వేసినట్లు వివరించారు. ఈ చిత్ర దర్శకుడు కరుణాకరన్‌ను చూసినప్పుడు రాజమౌళి, చంద్ర సిద్ధార్థ్ వంటి గొప్ప దర్శకులను చూసిన అనుభూతి కలిగిందని సూర్య తెలిపారు. కరుణాకరన్, అప్పటికి కొత్తవారైన హీరో యశో సాగర్‌కు, హీరోయిన్ స్నేహ ఉల్లల్‌కు వాకింగ్ స్టైల్, డైలాగ్ డెలివరీ వంటి ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా చేసి చూపించేవారని, ఇది షూటింగ్ యూనిట్‌లో అందరికీ ఎంతో వినోదాన్ని కలిగించిందని గుర్తు చేసుకున్నారు. యశో సాగర్ దర్శకుడి సూచనలను శ్రద్ధగా పాటిస్తూ, పక్కకు వెళ్లి నేర్చుకుని చేసేవారని తెలిపారు. కరుణాకరన్ కామెడీ టైమింగ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిందని సూర్య వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యనటుడు ,నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న నటుడు పింగ్‌పాంగ్ సూర్య. మొదట్లో, తన మావయ్య, దర్శకుడు గోపి గణేష్ పట్టాభి (బ్లఫ్ మాస్టర్, గాడ్సే వంటి చిత్రాల దర్శకుడు) వద్ద కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసేవారు. సూర్య చదువును మధ్యలో వదిలి సినిమా రంగంలోకి రావడాన్ని మొదట ఆయన మావయ్య గుర్తించలేదు. అయితే, తల్లిదండ్రుల ఒత్తిడితో మావయ్య వెతకడం ప్రారంభించినప్పుడు, సూర్య అన్నపూర్ణ స్టూడియోస్ నుండి ఇంటికి ఒక లేఖ రాశారు. ఆ సమయంలో కృష్ణవంశీ నిన్నే పెళ్లాడుతా సినిమా షూటింగ్ జరుగుతోందని, అసోసియేట్ డైరెక్టర్ సురేష్ అన్న తనను ఇంటికి వెళ్ళమని సలహా ఇచ్చారని సూర్య గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

తన తండ్రి ఆంధ్ర పేపర్ మిల్స్‌లో ఉద్యోగం చేసేవారని, ఆ చిరునామాకు లేఖ రాసినట్లు తెలిపారు. ఈ లేఖ చూసిన తర్వాత, మావయ్య సూర్యను తిరిగి ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి వెళ్ళాక, మావయ్య సూర్యతో “ఏ పాత్ర చేయాలన్నా కనీసం డైలాగ్స్ చదవగలగాలి, నువ్వు ఏడో తరగతితో ఆపేస్తే ఎలా?” అని ప్రశ్నించి, పదవ తరగతి వరకు చదువు పూర్తి చేయమని బలవంతంగా మళ్ళీ స్కూల్‌లో చేర్పించారు. అలా తొమ్మిదో, పదో తరగతి పూర్తి చేసి ఆ తర్వాత ఇంటర్ కూడా జాయిన్ అయ్యారు. ఆ తర్వాత సినీరంగంలో అవకాశాలు అందుకున్నారు.

యశో సాగర్ ఫోటో..

Pingpong Surya, Yasho Sagar

Pingpong Surya, Yasho Sagar

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

Follow Us
ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..
ఎలాంటి చెడు అలవాట్లు లేవు.. ఆ హీరో చనిపోవడానికి కారణం ఇదే..
ముంబైలో పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్
ముంబైలో పాండ్యాతో పాటు ఆ సీనియర్ స్టార్ బ్యాటర్‌ కూడా అవుట్
కేంద్రం సంచలన నిర్ణయం.. వీరికి ఎల్‌పీజీ కనెక్షన్‌ రద్దు..
కేంద్రం సంచలన నిర్ణయం.. వీరికి ఎల్‌పీజీ కనెక్షన్‌ రద్దు..
జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ..
జర్మనీలో భారతీయుల సరికొత్త చరిత్ర.. ఇండియా ఫెడరేషన్ ఆఫ్ జర్మనీ..
విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే!
క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే!
రికార్డు ధరలు.. గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ చేయడం కరెక్టేనా?
రికార్డు ధరలు.. గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ చేయడం కరెక్టేనా?
జూన్ 2026 పండుగలు, శుభ ముహూర్తాలు: వివాహ, గృహ ప్రవేశ, అన్నప్రాశన
జూన్ 2026 పండుగలు, శుభ ముహూర్తాలు: వివాహ, గృహ ప్రవేశ, అన్నప్రాశన
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా సుంకం తగ్గింపు
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా సుంకం తగ్గింపు
బరువు తగ్గాలనుకుంటున్నారా? క్వినోవా ఆరోగ్య రహస్యాలు, తయారీ విధానం
బరువు తగ్గాలనుకుంటున్నారా? క్వినోవా ఆరోగ్య రహస్యాలు, తయారీ విధానం