యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారిన్లో ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తారక్ తన కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితం కుటుంబంతో పారిస్ వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తారక్ తన ఫ్యామిలీ విషయాలను.. తన తనయుల ఫోటోలను చాలా అరుదుగా నెట్టింట్లో అభిమానులతో పంచుకుంటాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కావడం.. ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం షూటింగ్ పూర్తిచేసుకుని చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి ఫారిన్ ట్రిప్ చేశారు తారక్.
ఇక ఫారిన్లో తన కుమారులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్. నిన్న తన పెద్ద కొడుకు అభయ్ రామ్‌ను ఈఫిల్ టవర్ వద్ధ ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈరోజు తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకున్నారు. ట్రైన్లో భార్గవ్ రామ్ ని ముద్దాడుతూ కనిపించాడు తారక్. మరోవైపు.. ఎన్టీఆర్ సతిమణి ప్రణతి ఒడిలో ఎంతో ఒద్దికగా కూర్చున్నాడు భార్గవ్ రామ్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. తారక్.. నాకు ఎన్నో చెప్పాలని ఉంది.. కానీ ప్రస్తుతానికి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తనయుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న విడుదల చేయనున్నారు. ఇందులో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. అలియాభట్, ఒలివియో మోరీస్, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Nithiin: డిజిటల్ ఎంట్రీ ఇవ్వనున్న నితిన్ ? .. వెబ్ సిరీస్ చేసే ఆలోచనలో హీరో!..
బుల్లితెరపై స్టార్ కమెడియన్స్ సందడి.. ఆలీతో కలిసి హూషారుగా స్టెప్పులేసిన బ్రహ్మానందం..
Bigg Boss 5: బిగ్‌బాస్ హోస్ట్ మారనున్నారా..? రంగంలోకి దిగనున్న శృతీ హాసన్.. కారణం ఏంటో తెలుసా.?