న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ విజయంతో దూసుకుపోతున్నాడు. గత నెలలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ స్పెషల్ వీడియో షేర్ చేసుకున్నారు నాని.
ఆ వీడియో చిత్రయూనిట్‌తో కలిసి.. అంటే సుందరానికీ షూటింగ్ పూర్తైనట్లు తెలిపారు నాని. ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఇది రోలర్ కోస్టర్ మూవీ ఆఫ్ ది ఇయర్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు నాని. ఈ సినిమాలో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. నజ్రియా నజీమ్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. నజ్రియా హీరోయిన్ గా పదేళ్లపాటు మలయాళ చిత్రపరిశ్రమను ఊపేసింది. తమిళ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు.. అంటే సుందరానికీ షూటింగ్ కంప్లీట్ అయినట్లు నాని తెలపడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ట్వీట్..
It’s a wrap for the roller coaster movie of the year ♥️#AnteSundaraniki pic.twitter.com/1Kq27vtPF9
— Nani (@NameisNani) January 23, 2022
Also Read: BhamaKalapam Teaser: బాబోయ్ ఈ భామ చాలా డేంజర్ సుమా..! ఆసక్తికరంగా భామా కలాపం టీజర్..
Shruti Haasan: ప్రభాస్ అందరూ అనుకునేలా కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన అందాల శ్రుతిహాసన్..
Sreeleela : క్రేజ్ పెరిగింది రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.. భారీగా డిమాండ్ చేస్తుందట శ్రీలీల..
Raashi Khanna: టాలీవుడ్ అలా బాలీవుడ్ మాత్రం ఇలా.. ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ..