Rajinikanth: రజినీకాంత్ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ రోల్.. జైలర్ 2పై గూస్ బంప్స్ అప్డేట్స్..

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కూలీ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈమూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. మరోవైపు జైలర్ 2 చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

Rajinikanth: రజినీకాంత్ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ రోల్.. జైలర్ 2పై గూస్ బంప్స్ అప్డేట్స్..
Rajinikanth, Nagarjuna

Updated on: May 28, 2025 | 12:51 PM

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కూలీ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఇందులో సౌబిన్ షకీర్, ఉపేంద్ర రావు, శ్రుతి హాసన్, సత్యరాజ్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రజనీకాంత్ చిత్రం కూలీ ఆగస్టు 14, 2025న థియేటర్లలోకి రానుంది. దీనికి సంబంధించి చిత్రబృందం గతంలోనే అధికారిక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే జనాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు త్వరలోనే జైలర్ చిత్రానికి సీక్వెల్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్ నడుస్తుంది. జైలర్ 2 మూవికి సంబంధించి రోజుకో న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది.

జైలర్ 2 చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారట. గతంలో మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ ముఖ్య పాత్రలలో కనిపించారు. ఇక ఇప్పుడు జైలర్ 2లోనూ భారీ తారాగణం కనిపించనుందని సమాచారం.

నివేదికల ప్రకారం ఈ చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నడట. అయితే ఇప్పుడు అతడి స్థానంలో నాగార్జున నటిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ జైలర్ 2 చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..