ఈ కరోనా లాక్ డౌన్ సీజన్ కాస్తా, సినిమా వాళ్ల పెళ్లిళ్ల సీజన్ గా మారిపోయింది. ఇప్పటికే పలువురు చిత్ర సీమ ప్రముఖులు జీవిత భాగస్వాములతో ఏడడుగులు వేశారు. తాజాగా మరో హీరోయిన్ పెళ్లి చేసుకుంది. నటుడు సునీల్ సరసన ఉంగరాల రాంబాబు సినిమాలో నటించిన మియాజార్జ్ ఇప్పుడు శ్రీమతిగా మారింది. ప్రముఖ బిజినెస్ మేన్ అశ్విన్ ఫిలిప్‌తో ఏడడుగులు నడిచింది. కేరళలోని కొచ్చిలో జరిగిన వివాహ వేడుకకు కరోనా నేపథ్యంలో చాలా తక్కువ మంది గెస్టులు హాజరయ్యారు. ఈ కొత్త జంట పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన మియా తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించారు.
Also Read :
దొంగతనానికి వచ్చి, గురకపెట్టి నిద్రపోయాడు
“వెయిటర్‌గా పనిచేస్తున్నప్పుడు, టిప్పుగా ఓ మహిళ కిస్ పెట్టింది”