
మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా కన్నప్ప. ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం (జూన్ 27)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజి బిజీగా గడుపుతోంది. ఇక హీరో విష్ణు కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇదే సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతోన్న మంచు విష్ణుకు అస్సలు సినిమాల్లోకి రావాలనే ఆలోచనే లేదట. ‘నేను చిన్నప్పుడు ఓ సినిమా చేసినా ఈ రంగంలో స్థిరపడాలనుకోలేదు. ఎందుకంటే డాడ్ నన్ను ఐపీఎస్ చేయాలనుకున్నారు. నన్ను ఓ ప్రభుత్వ అధికారిగా చూడాలన్నది నాన్న కోరిక. అందుకే ఇంజనీరింగ్ లో కూడా చేరాను. అయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో డాడీ నా వద్దకు వచ్చి ‘ ఐపీఎస్ కంటే నీకు సినిమాలే బాగుంటాయన్నారు. అప్పటి నుంచి సినిమాల మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేశాను. నటుడిగా అవసరమైన ట్రాన్సపర్మేషన్ అంతా అప్పటి నుంచే ప్రారంభమైంది. లేదంటే నన్ను అందరూ ఐపీఎస్ గా చూసేవారేమో’ అని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
కాగా తన తండ్రి మోహన్ బాబు లాగే విష్ణు కూడా క్రమశిక్షణ, సమయపాలనకు బాగా ప్రాధాన్యమిస్తాడట. ‘నేను ఉదయం నాలుగు గంటలకే నిద్రలేస్తాను. నా పను లన్నీ నేనే స్వయంగా చేసుకుంటాను. ఇతరుల కోసం అసలు వెయిట్ చేయను. ఎన్ని పనులున్నా రాత్రి పదిలోపు ముగించుకుని నిద్రపోతాను. డే అంతా ఎంత బిజీగా ఉన్నా జిమ్ మాత్రం స్కిప్ కొట్టను. అలాగే ఖాళీ టైమ్ దొరికితే క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడుతాను. క్యాంపస్ లో నేను బాస్కెట్ బాల్ కెప్టెన్ కూడా. ఆటలపై ఆసక్తితో మార్షల్ ఆర్స్ట్ లోనూ ట్రైనింగ్ తీసుకున్నాను. లాస్ ఏంజెల్స్ లో స్టంట్ మ్యాన్ గా కూడా పని చేశాను. ఆ అనుభవంతోనే `కన్నప్ప`లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు నేనే స్వయంగా డిజైన్ చేశాను ‘ అని చెప్పుకొచ్చాడు మంచు వారబ్బాయి.
Thank you for your love you have shown for the more release event of Kannappa.
Cannot wait for you to watch it on June 27th#Kannappa #Kannappa27thJune #HarHarMahadevॐ pic.twitter.com/08XebBe6Kl
— Vishnu Manchu (@iVishnuManchu) June 22, 2025
.మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.