Mahesh Babu: మాస్ క్యారెక్టర్‏లో మజా చేయనున్న మహేష్.. కెరీర్ లోనే తొలిసారి పూర్తి డిఫ్రంట్ రోల్‏లో…

|

Oct 08, 2022 | 10:17 AM

ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నెట్టింట రోజుకో వార్త చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో ఈ సినిమా నుంచి మహేష్ క్యారెక్టర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

Mahesh Babu: మాస్ క్యారెక్టర్‏లో మజా చేయనున్న మహేష్.. కెరీర్ లోనే తొలిసారి పూర్తి డిఫ్రంట్ రోల్‏లో...
Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే మహేష్ తల్లి ఇందిరా దేవి అకాల మరణంతో మరికొద్ది రోజులు ఈ ప్రాజెక్ట్ రెగ్యూలర్ షూటింగ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. ముందునుంచి త్రివిక్రమ్, మహేష్ కాంబోలో రాబోతున్న ఈ ఎస్ఎస్ఎంబీ 28 ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు నెట్టింట రోజుకో వార్త చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఫిల్మ్ సర్కిల్లో ఈ సినిమా నుంచి మహేష్ క్యారెక్టర్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని.. ఇంతవరకు తన కెరీర్‏లో ఎప్పుడూ కనిపించని డిఫరెంట్ రోల్ ఇందులో చేస్తున్నాడని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ మహేష్ క్యారెక్టర్ డిజైన్ చేశాడని సమాచారం. ఈ సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్ఎస్. థమన్ సంగీతం అంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అక్టోబర్ 10 నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా తర్వాత మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఇప్పటివరకు తాను చేసిన చిత్రాలన్నింటికంటే పెద్దదిగా ఉంటుందని జక్కన్న ఇదివరకే చెప్పారు. అలాగే ఆఫ్రికన్ అడువుల నేపథ్యంలో ఉండబోతుందని చెప్పుకొచ్చారు రచయిత విజయేంద్ర ప్రసాద్.