స్టార్ హీరో కమల్ హాసన్ కరోనా భారీన పడిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికాకు వెళ్లి వచ్చిన తర్వాత కోవిడ్ లక్షణాలతో కమల్ ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే టెస్ట్ చేయించుకోగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం కమల్ హాసన్ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటు క్వారంటైన్లో ఉంటున్నారు. ఇక కమల్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు.. ఆయన కూతురు శృతి హాసన్ సైతం సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. తాజాగా కమల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. తాజాగా బిగ్ బాస్ షోలో తన సహోద్యోగులతో హాస్పిటల్ నుంచి వీడియో కాల్ మాట్లాడినట్టుగా తెలిపారు. కమల్ హాసన్ పూర్తిగా రెండు టీకాలు వేసుకున్నప్పటికీ కరోనా భారీన పడ్డారు. ఈ విషయం పై వైద్యులుక క్లారిటీ ఇచ్చారు.. కోవిడ్ రెండు టీకాలు వేసుకోవడం ద్వారా సీరియస్ కండీషన్.. చనిపోయే ప్రమాదం తగ్గి్స్తాయని.. పూర్తిగా వ్యాక్సినేటేడ్ వ్యక్తులకు కూడా కరోనా వస్తుందని తెలిపారు.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒవిక్రాన్ పై తాజాగా జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి జె రాధాకృష్ణన్ కేంద్ర ఏజెన్సీలతో సమావేశమయ్యారు. ఇతర దేశాల నుంచి వచ్చే వ్యక్తులు.. లేదా రవాణా పై నిఘా పెంచాలని జిల్లా నిర్వాహకులకు.. ఇతర ఏజెన్సీలను ఆదేశించారు.
పరగడుపున నిమ్మకాయ రసం తాగితే నిజంగానే బరువు తగ్గుతారా..? వాస్తవాలు ఏంటో తెలుసుకోండి..
Omicron Variant: ఓమిక్రాన్ వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ ఫుల్ ఫోకస్.. సబ్ కమిటీ నియామకం..