Tollywood Kajal Aggarwal Name: టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ కొత్త పేరేంటో తెలుసా..?
Tollywood Kajal Aggarwal Neme:టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లకుపైనే అయింది. తన కెరీర్‌లో గ్లామర్ పాత్రలు..
Tollywood Kajal Aggarwal Neme:టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లకుపైనే అయింది. తన కెరీర్‌లో గ్లామర్ పాత్రలు, సీరియస్ పాత్రలతో కాకుండా ప్రత్యేక గుర్తింపు తెచ్చే పాత్రలను సైతం నటించి ఎంతో అభిమానాన్ని సంపాదించుకుంది. గత ఏడాది కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది.
వివాహం అయిన తర్వాత అగర్వాల్ భర్తతో కలిసి మాల్దివులు టూర్‌కు వెళ్లగా, అక్కడ అందచందాలకు మంత్రముగ్ధులయ్యారు. సముద్రపు నీటి మధ్య వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి అయిన తర్వాత కాజల్ అగర్వాల్ తన పేరును ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చుకుంది. తన భర్త పేరు, తన ఇంటి పేరు కలిసి వచ్చేలా ‘కాజల్ ఎ కిచ్లు’ అని పెట్టుకుంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ మూవీలో నటిస్తోంది. ఇక కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్ ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: ఆకట్టుకుంటున్న ‘మాస్టర్’ డెలిటెడ్ సీన్.. మేకర్స్ పై సీరియస్ అవుతున్న నెటిజన్స్..