Jr NTR: ‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను లైక్ చేశా.. ఆ తర్వాత..’ కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్..

|

Apr 20, 2024 | 6:37 PM

యుక్త వయస్సులో ఉన్నప్పుడు అందరికీ చాలా రకాల ఆకర్షణలు ఉంటాయి. తెలియక కొన్ని విషయాల వైపు మొగ్గు చూపుతుంటాం. మనం చేసే పని తప్పా, రైటా అనే డౌట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు రియలైజ్ అవుతాం. అలాంటి ఓ ఇన్సిడెంట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగింది.

Jr NTR: ‘అప్పట్లో ఆ హీరోయిన్‌ను లైక్ చేశా.. ఆ తర్వాత..’ కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్..
Jr NTR
Follow us on

యంగ్ టైగర్ ఎన్టీఆర్. గుర్తు పెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల హిస్టరీలో ఈ పేరు ఖచ్చితంగా చరిత్ర లిఖిస్తుంది. ఇప్పటికే సినిమాల్లో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. రాజకీయాల్లోనూ సత్తా చాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నారు. తాత రూపంతో  పాటు ప్రతిభను పుణికి పుచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టాలీవుడ్‌తో తోపు యాక్టర్. మాస్‌కి బాప్‌గా ఆయన్ను అభివర్ణిస్తూ ఉంటారు. RRRతో దేశవ్యాప్తంగా తన టాలెంట్ ఏంటో చూపిన ఎన్టీఆర్.. త్వరలో దేవరతో బాక్సాఫీసు రికార్డులు కొల్లగొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అటు బాలీవుడ్‌లో వార్-2లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇది ఎన్టీఆర్ నామ సంవత్సరం అని.. దర్శకుడు త్రివిక్రమ్‌తో పాటు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. డైలాగ్ చెప్పాలన్నా, ఎమోషన్ పండించాలన్నా, డ్యాన్స్ చేయాలన్నా..  చిన్న ఎన్టీఆర్ సుస్పష్టం. సినిమాల పరంగా ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడు తారక్.

అలానే ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో హ్యాపీగా సాగుతోంది. ఎంతో ప్రేమించే తల్లి,  ఫ్యామిలీ మొత్తాన్ని ఆప్యాయంగా చూసుకునే భార్య, చాకుల్లాంటి ఇద్దరు తనయులతో ఎన్టీఆర్.. చాలా సంతోషంగా ఉన్నారు. అయితే కెరీర్ ఆరంభంలో తారక్ కూడా కాస్త పక్క చూపులు చూశారు. ఆయన ఓ హీరోయన్‌ను బాగా లైక్ చేశారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సైతం నిర్భయంగా చెప్పేశారు. అప్పట్లో గట్టిగానే దాని గురించి పబ్లిసిటీ చేసినట్లు వ్యాఖ్యానించాడు.  అలా ఓ దగ్గర ఓ పర్సన్ అంటే ఇష్టం కలిగిందని.. ఆ తర్వాత కరెక్ట్ కాదేమో అనిపించిందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. 23 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అది జరిగిందని.. అది అప్రస్తుతం అని తారక్ పేర్కొన్నాడు. దాని వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని .. చెప్పుకొచ్చారు. జీవితంలో తీసుకున్న ఏ నిర్ణయం పట్ల తాను బాధపడటం లేదని తారక్ వెల్లడించాడు. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు 100 రకాలుగా తప్పు ఒప్పులు ఆలోచిస్తానని తెలిపారు.

వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని తాను అస్సలు కలపనని ఎన్టీఆర్ వివరించాడు. ఇంటర్ చదివే సమయంలో.. కొన్ని రకాల కోతి వేషాలు వేశానని.. అవి అందరి జీవితంలో కామన్ అని చెప్పుకొచ్చాడు తారక్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.