Jayam Ravi : స్టార్ హీరో ఇంట్లో దొంగతనం.. రూ.10 లక్షల వజ్రాల నెక్లెస్ మాయం.. డ్రైవర్ అరెస్ట్..

కోలీవుడ్ హీరో జయం రవి పేరు కొంతకాలంగా వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు భార్యతో వివాదం, విడాకుల కేసుతో జయం రవి పేరు నెట్టింట మారుమోగింది. అలాగే ఇటీవల ఇంట్లో పని మనుషులను బంధించి హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు ఆయన డ్రైవర్ దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు. హీరో ఇంట్లో జరిగిన వజ్రాల హారం చోరీ కేసులో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Jayam Ravi : స్టార్ హీరో ఇంట్లో దొంగతనం.. రూ.10 లక్షల వజ్రాల నెక్లెస్ మాయం.. డ్రైవర్ అరెస్ట్..
Jayam Ravi

Updated on: Jul 04, 2026 | 7:58 AM

ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) చెన్నైలోని నివాసంలో జరిగిన దొంగతనం కేసులో ఆయన కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు . అరెస్టు అయిన నిందితుడి నుంచి రూ. 2.5 లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, రూ. 10 లక్షల విలువైన అదృశ్యమైన వజ్రాల నెక్లెస్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. జూన్ 22న చెన్నైలోని ఇంజంబాక్కంలో ఉన్న నటుడు రవి మోహన్ నివాసం నుంచి విలువైన వస్తువులు మాయమయ్యాయి. ఈ విషయమై నటుడి మేనేజర్ నీలన్‌కరై పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. అంతకుముందు, ఇంట్లో పనిచేసే సిబ్బందే ఈ దొంగతనానికి పాల్పడ్డారని అనుమానించారు. దీంతో ఇంట్లో పనిచేసేవారిని బంధించినట్లు పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఇంట్లో ఉన్న ఇద్దరు మహిళా కార్మికులను, ఒక బాలుడిని విడిపించారు. దొంగతనం ఆరోపణలు ఉన్నప్పటికీ, చట్టబద్ధంగా ఫిర్యాదు చేయాలని, ఎవరినీ బంధించి విచారించకూడదని పోలీసులు హెచ్చరించారు. ఆ తర్వాత ఒక వజ్రాల నెక్లెస్, రూ.10 లక్షల నగదు కనిపించడం లేదని మేనేజర్ ఫిర్యాదు చేశారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆ ఇంట్లో పనిచేసే సిబ్బందిని, డ్రైవర్‌ను విడివిడిగా విచారించారు. ఈ సమయంలో, గత ఆరు నెలలుగా రవి మోహన్‌కు కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేష్‌పై పోలీసులకు బలమైన అనుమానం కలిగింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా, నిందితుడైన డ్రైవర్ తానే లాకర్‌ను తెరిచి డబ్బు దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..
నిందితుడి నుంచి దొంగిలించిన డబ్బును స్వాధీనం చేసుకుని నటుడికి అప్పగించారు. అయితే, ఫిర్యాదులో పేర్కొన్న రూ. 10 లక్షల విలువైన వజ్రాల నెక్లెస్ ఇంకా లభ్యం కాలేదు. నిందితుడు రాజేష్‌ను కోర్టులో హాజరుపరిచి, జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించారు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

Follow Us