బుల్లితెరపై హైపర్ ఆదికి (Hyper Aadi) ఉండే క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు చేరువయ్యాడు. తనదైన మార్క్ కామెడీతో..పంచులతో ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించడంలో హైపర్ ఆది దిట్ట. అయితే తనకు అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అని.. ఎప్పటికీ ఆయనను అభిమానిస్తూనే ఉంటానని అన్నారు ఆది. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ.. అందరి మంచి కోరుకునే వ్యక్తి పవన్ అంటూ చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం ? అని యాంకర్ ప్రశ్నించగా.. ఆది మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ అంటే నాకు అమితమైన ఇష్టం. హరిహర వీరమల్లు సినిమా కోసం చిన్న పని చేస్తున్నాను. ఈ క్రమంలోనే ఇటీవల ఆయన ఇంటికి ఓ నాలుగు రోజులు వెళ్లి కలిశాను. అప్పుడు తెలిసింది ఆయనెంత గొప్ప వ్యక్తి అని. ఆయనకు డబ్బు అంటే అస్సలు ఆసక్తి లేదు. ఎప్పుడు ఎదుటివారికి మంచి చేయాలనే ఆలోచిస్తారు. సినిమాల నుంచి వచ్చే నగదును కౌలు రైతులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. సినిమా చేస్తే సుమారు రూ. 50 కోట్లు వస్తే ఆ మొత్తాన్ని పేదలకు సాయం చేయడానికి .. పార్టీ కార్యకర్తల కోసం పంచుతున్నారు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది. అందరి మంచి కోరుకునే వ్యక్తికి మంచి జరిగితే మనం ఎంతో సంతోషిస్తాం కదా. ఆయన నా భావన ఎప్పుడు అదే” అంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.