‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు హర్షవర్దన్ రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు' లో ఓ కీలక పాత్రలో నటించాడు హర్షవర్ధన్. తనదైన నటనతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యుకు హాజరైన ఆయన ఈ మూవీ రెమ్యునరేషన్ వివరాలను బయట పెట్టాడు.

మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు హర్షవర్దన్ రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలు తీసుకున్నాడో తెలుసా?
Actor Harsha Vardhan

Updated on: Jan 28, 2026 | 6:56 PM

టాలీవుడ్ లో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ ఆర్టిస్టుల్లో హర్షవర్ధన్ కూడా ఒకరు. అమృతం సీరియల్ తో ఎంతో ఫేమస్ అయిన ఆయన ఓ ఓ మంచి రచయిత కూడా. కొన్నేళ్ల క్రితం అమృతం, శాంతి నివాసం, కస్తూరి తదితర సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి మెప్పించారాయన. తనదైన నటనతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. ఓవైపు సీరియల్స్ తో నటిస్తూనే మరోవైపు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లోనూ మెరిశారు హర్ధవర్ధన్. అయితే మధ్యలో కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన మళ్లీ ఇప్పుడు సహాయక నటుడిగా బిజీ బిజీగా మారిపోయారు. సరిపోదా శనివారం, మారుతీ నగర్ సుబ్రమణ్యం, కోర్టు, పరదా, ఆంధ్రాకింగ్ సినిమాల్లో హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించాయి. ఇక లేటెస్ట్ గా మన శంకరవరప్రసాద్‌గారు సినిమాలోనూ ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నారీ సీనియర్ నటుడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుక వచ్చింది. ఏకంగా రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది.

కాగా మన శంకరవరప్రసాద్ గారు మూవీ షూటింగ్ సమయంలో హర్షవర్ధన్‌కు యాక్సిడెంట్‌ కూడా అయింది. అయినా ఆస్పత్రి బెడ్‌పై నుంచే షూటింగ్ పూర్తి చేశాడని హర్షవర్దన్ పై చిరంజీవి, అనిల్ రావిపూడి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న హర్షవర్ధన్ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే సందర్భంగా మన శంకరవరప్రసాద్ గారు మూవీ రెమ్యునరేషన్ వివరాలు కూడా షేర్ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

‘ రెమ్యునరేషన్‌ అనేది రెండురకాలుగా ఉంటుంది. ఒకటి సినిమా మొత్తానికి కలిపి ఓవరాల్ ప్యాకేజీ మాట్లాడుకోవడం.. రెండోది రోజుకు ఇంత అని లెక్కగట్టడం. మన శంకరవరప్రసాద్ సినిమా కోసం నేను 60 రోజులు డేట్స్‌ ఇచ్చాను. రెండు నెలలు కాబట్టి రోజు లెక్కన పారితోషికం ఇవ్వరు. ఓవరాల్ ప్యాకేజీ ఫిక్స్‌ చేశారు. అలా ఈ సినిమాకు రూ.40 లక్షల రెమ్యునరేషన్‌ తీసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు హర్షవర్ధన్. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు చిరంజీవి విశ్వంభరతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి