AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : నాలుగేళ్లుగా వివాదం.. రియల్ స్టోరీతో మూవీ.. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే సినిమా డిలీట్.. అసలు కారణం ఇదే..

సాధారణంగా ఒక సినిమాను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత మాములు విషయం కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. మరెన్నో సంఘర్షనలు, పరిస్థితులు వస్తుంటాయి. మూవీ విడుదలకు అనేక అడ్డంకులు రావడం సహజం. సెన్సార్ వివాదాలు, నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఇష్యూస్ వల్ల కూడా కొన్ని సినిమాలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సినిమా ఓటీటీలో విడుదలైన 2 రోజుల్లోనే డిలీట్ చేశారు. ఇంతకీ కారణమేంటో తెలుసుకుందామా.

Cinema : నాలుగేళ్లుగా వివాదం.. రియల్ స్టోరీతో మూవీ.. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లోనే సినిమా డిలీట్.. అసలు కారణం ఇదే..
Satluj Film
Rajitha Chanti
|

Updated on: Jul 07, 2026 | 3:04 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సినిమా హాట్ టాపిక్ అయ్యింది. గత శుక్రవారం అంటే జూలై 3న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో విడుదలైంది సట్లేజ్ అనే సినిమా. బాలీవుడ్ స్టార్ సింగర్ కమ్ హీరో దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కేవలం రెండు రోజులకే ఓటీటీ నుంచి డిలీట్ చేశారు. ఇప్పుడు అదే విషయం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇప్పటికే ఆ చిత్రాన్ని చూసిన అడియన్స్.. సగం కంటెంట్ చూసిన సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సినిమా గురించి వరుస పోస్టులు చేస్తున్నారు. సట్లేజ్.. పంజాబ్ మానవ హక్కుల కారకర్త జస్వంత్ సింగ్ ఖాల్రా రియల్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జస్వంత్ ఖాల్రా.. 1990లలో పంజాబ్ లో అదృశ్యమైన పలువురు వ్యక్తుల కేసులపై ఆయన పరిశోధనలు చేసి కీలక ఆధారాలు బయటపెట్టారు. అదే సమయంలో 1995లో ఆయనను హత్య చేశారు. దీంతో అప్పట్లో పంజాబ్ లో ఎన్నో అలర్లు జరిగాయి. ఈ వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని దిల్జి్త్ హీరోగా, దర్శకుడు హనీ ట్రెహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..

అయితే ఈ సినిమాకు మొదట ఘల్లుఘరా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తర్వాత పంజాబ్ 95 అనే టైటిల్ ఎంపిక చేయగా.. చివరకు సట్లెజ్ పేరుతో ఓటీటీలో రిలీజ్ చేశారు. గత నాలుగేళ్లుగా అంటే 2022 నుంచి ఈ చిత్రానికి అడ్డంకులు ఎదురయ్యాయి. షూటింగ్ పూర్తైనప్పటికీ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికే ఈసినిమాలో దాదాపు 21 మార్పులు సూచించింది. ఆ తర్వాత మరోసారి 127 కట్స్ సూచించింది. దీంతో అన్ని సీన్స్ కట్ చేశాక ఇక సినిమానే ఉండదని.. నిర్మాతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో గత నాలుగేళ్లుగా సినిమా విడుదల వాయిదా పడుతూనే వచ్చింది. ఈ క్రమంలోనే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ చిత్రాన్న జూలై 3న జీ5 ఓటీటీలో రిలీజ్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?

కానీ సడెన్ గా విడుదలైన రెండు రోజుల్లోనే సినిమాను డిలీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సినిమాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని భారత ప్రేక్షకులకు మళ్లీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తామని అనౌన్స్ చేసింది జీ5 సంస్థ. అయితే ఈ వివాదంపై స్పందించాడు హీరో దిల్జిత్..ఈ సినిమాను ముందుగా అనౌన్స్ చేస్తే అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ అయ్యేది కాదని.. అందుకే రిస్క్ తీసుకోకుండా సైలెంట్ గా రిలీజ్ చేశామని అన్నారు. జస్వంత్ సింగ్ ఖాల్రా స్టోరీ ఎలాగైనా ప్రజలకు తెలియాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. గత నాలుగేళ్లుగా సినిమాను రిలీజ్ చేయడానికి టీమ్ మొత్తం ఎంతో కష్టపడిందని.. ఎవరి దగ్గరకు వెళ్లి సపోర్ట్ అడగలేదు.. మా పోరాటం మేమే చేశామని అన్నారు. ప్రస్తుతం సట్లేజ్ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..

ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..

Follow Us
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
టీనేజర్ల కోసం స్పెషల్ ChatGPT వెర్షన్‌.. దండిగా సేఫ్టీ ఫీచర్లు!
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
పీరియడ్స్ వచ్చాయా.? అంటూ నీచంగా మాట్లాడేవాడు..
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
గ్యాస్ ట్రబుల్ ను తగ్గించి పేగులను క్లీన్ చేసే హై ప్రోటీన్ కూర
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
ఈ జామ రైతు సక్సెస్ సీక్రెట్ తెలిస్తే.. మీరూ ఫాలో అవుతారు..
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
తెలుగు యువతకు జర్మనీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.3.30లక్షల జీతం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ రికార్డులు బ్రేక్ చేసిన పంత్
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
2027లో ఆహార ధరలకు రెక్కలు..! ఎరువుల కొరత, ఎల్ నినోతో భారత్‌కు..
స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు
స్టార్ హీరోతో విబేధాలు.. కొడుకు కోసం ఆస్తిమొత్తం పోగొట్టుకున్నాడు
23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!
23 ఏళ్ల చిన్నదానితో రిలేషన్.. పెళ్లి మాత్రం చేసుకోను..!
జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!
జ్వరం వచ్చిందని యాంటీబయాటిక్స్‌ ఎడాపెడా వాడొద్దు.. ఎందుకంటే!