Andala Ramudu: అందాల రాముడు సినిమాలో సునీల్ కంటే ముందు ఆ నటుడిని హీరోగా అనుకున్నారట..

సునీల్ ఉంటే చాలు హాయిగా నవ్వుకోవొచ్చు అని సినిమాకు వెళ్లేవారు కూడా ఉన్నారు. అలాంటి సునీల్ సడన్ గా హీరోగా మారాడు. ఆతర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయాడు.

Andala Ramudu: అందాల రాముడు సినిమాలో సునీల్ కంటే ముందు ఆ నటుడిని హీరోగా అనుకున్నారట..
Andala Ramudu

Updated on: Jan 21, 2023 | 12:19 PM

టాలీవుడ్ లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. కామెడీ టైమింగ్ తో పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. సునీల్ ఉంటే చాలు హాయిగా నవ్వుకోవొచ్చు అని సినిమాకు వెళ్లేవారు కూడా ఉన్నారు. అలాంటి సునీల్ సడన్ గా హీరోగా మారాడు. ఆతర్వాత వరుసగా హీరోగా సినిమాలు చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోయాడు. ఇక ఇప్పుడు విలన్ వేషాలతో ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో మంగళం శ్రీను పాత్రలో సునీల్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు సునీల్. ఇదిలా ఉంటే సునీల్ హీరోగా చేసిన మొదటి సినిమా అందాల రాముడు. ఆ సినిమాలో సునీల్ కామెడీతో పాటు ఎమోషన్స్ ను కూడా చక్కగా పలికించి సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో అప్పటి అందాల హీరోయిన్ ఆర్తి అగర్వాల్ నటించిన విషయం తెలిసిందే..

అయితే సునీల్ కాంట్ ముందే ఈ సినిమాను మరో హీరోతో చేయాలనీ అనుకున్నారట.. ఆయన ఎవరంటే.. నటుడు బ్రహ్మాజీని అనుకున్నారట. అప్పటికే బ్రహ్మాజీ హీరోగా సినిమాలు చేశారు. ఆ తర్వాత నెగిటివ్ రోల్స్ చేశారు. అదేవిధంగా కామెడీ పాత్రల్లో కూడా నటించారు. దాంతో బ్రహ్మజీని ముందుగా అందాల రాముడు సినిమాలో హీరోగా అనుకున్నారట.

అయితే బ్రహ్మాజీ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఆ ఛాన్స్ సునీల్ కు వచ్చిందట. ఇక అందాల రాముడు సినిమా సునీల్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత రాజమౌళితో కలిసి మర్యాద రామన్న సినిమా చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో సునీల్ కు అవకాశాలు వెల్లువెత్తాయి.

Brahmaji