Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యునరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?

సందర్భమేదైనా ముక్కు సూటిగా మాట్లాడడం బండి సరోజ్ కుమార్ కు అలవాటు. అతని లాగే అతని సినిమాలు కూడా చాలా బోల్డ్ గానే ఉంటాయి. ఇటీవలే మోగ్లీ సినిమాలో విలన్ గా మెప్పించిన ఈ పబ్లిక్ స్టార్ తాజాగా ట్విట్టర్ (ఎక్స్)లో ఒక సంచలన పోస్ట్ పెట్టాడు.

Bandi Saroj Kumar: కోట్ల రెమ్యునరేషన్లు కావాలి కానీ.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
Actor Bandi Saroj Kumar

Updated on: Feb 04, 2026 | 9:09 PM

బండి సరోజ్ కుమార్ అలియాస్ పబ్లిక్ స్టార్.. ఈ తెలుగు నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు సరోజ్ కుమార్. తన మొదటి మూడు సినిమాలన్నీ యూట్యూబ్ లో రిలీజ్ కావడం గమనార్హం. అయితే పరాక్రమం సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగానూ మెప్పించాడీ పబ్లిక్ స్టార్. ఇక గతేడాది సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన మోగ్లీ సినిమాలో విలన్ గా భయపెట్టాడు సరోజ్ కుమార్. ఇదిలా ఉంటే విషయమేదైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంటాడీ నటుడు. మోగ్లీ సినిమా రిలీజ్ కు ముందు కూడా ఇతను పెట్టిన పోస్టులు కొన్ని తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ట్విట్టర్ వేదికగా మరో సంచలన పోస్ట్ పెట్టాడు సరోజ్ కుమార్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన రివ్యూ మాఫియాలు, కేసులు, టికెట్ రేట్ల పెంపు తదితర అంశాలపై తన అభిప్రాయాలన్నింటినీ ఈ ట్విట్ తో పంచుకున్నాడు.

‘కవర్లు తీసుకొని పెయిడ్ రివ్యూలు రాసే కొంత మంది అమ్ముడుపోయిన జర్నలిస్టులను పబ్లిక్ ఎప్పుడో వెలివేసింది. వీళ్ల రివ్యూలను పక్కన పెట్టండి. ఇంటర్వ్యూలకి కూడా వ్యూస్ రావు. నిన్న మొన్న వచ్చిన podcast కుర్రాళ్ళకి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. Because they discuss cinema. అలాగే యూట్యూబ్ లో రివ్యూస్ ఇచ్చే independent reviewers లో authenticity లేదు అని పబ్లిక్ భావించినప్పుడు వాళ్లే ignore చేస్తారు. Article 19 అని ఒకటి ఉంది. దాని పైన PIL వేసి పోరాడండి. లేదా రివ్యూ నచ్చకపోతే డైరెక్ట్ గా ఫైట్ చెయ్యండి. అంతే కానీ ఈ కేసులు పెట్టి వాళ్ళ గొంతుకి మరింత బలం ఇవ్వడం తప్ప ఒరిగేదేమీ లేదు. అన్నిటికంటే ముఖ్యంగా టికెట్ రెట్లపైన నియంత్రణ తీసుకొస్తే Footfalls వద్దన్నా పెరుగుతాయి. రెమ్యూనరేషన్లూ కావాలి, కలెక్షనూ కావాలి. మళ్లీ ఎవ్వడూ నోరు మెదపకూడదు’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చాడు పబ్లిక్ స్టార్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

బండి సరోజ్ కుమార్ ట్వీట్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..