సినిమా వాళ్లందరూ కలిసి చర్చించుకుంటే బాగుంటుందని అన్నారు బాలకృష్ణ(Balakrishna). ఈరోజు జరిగిన అఖండ (Akhanda) బ్లాక్ బస్టర్ థ్యాంక్యూ మీట్లో బాలకృష్ణ టికెట్స్ రేట్స్ అంశంపై స్పందించారు. గత కొద్ది రోజులుగా సినీ పరిశ్రమకు.. ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్స్ రేట్స్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ ఇండస్ట్రీ అసహనం వ్యక్తం చేసింది. రెండేళ్లుగా సినీ పరిశ్రమ కరోనా ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిందని.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న సమయంలో ప్రభుత్వం సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడం సరికాదని సినీ ప్రముఖులు వాపోతున్నారు. ఇదే విషయంపై ప్రొడ్యుసర్స్, ఎగ్జిబిటర్స్, ఏపీ మంత్రుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం నడిచింది. సినిమా టికెట్స్ తగ్గించే విషయంపై మరోసారి పునరాలోచించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇదే విషయంపై ఇటీవల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని మధ్య ట్విట్టర్ వార్ జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మంత్రి పేర్ని నానితో రామ్ గోపాల్ వర్మ సమావేశమయ్యి సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై మాట్లాడారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా టికెట్స్ రేట్స్ ఇష్యూపై స్పందించారు. ఈ వివాదం పై సినిమా వాళ్లందరూ కలిసి చర్చించుకుంటే బాగుంటుందని అన్నారు బాలకృష్ణ. ఈరోజు జరిగిన అఖండ బ్లాక్ బస్టర్ థ్యాంక్యూ మీట్లో బాలకృష్ణ టికెట్స్ రేట్స్ అంశంపై స్పందించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. సినిమా టికెట్స్ రేట్స్ విషయంలో అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని, చర్చలు జరిపితే బాగుంటుంది. ఇక్కడ వాదన, టికెట్ రేట్లు పెంచడమా తగ్గించడమా..? అయితే ఇక్కడ నా ఒక్కడి అభిప్రాయం కాదు.. ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లాలి. ఇది కూడా ఈ రోజు నిత్యావసరంగా మారింది. అందుకే రేట్లు అందుబాటులో ఉండడం అనేది సరైనదే కావచ్చు. కానీ ఈ పాండామిక్ పరిస్థితులో ఇది సరైనాదేనా అనేది ఆలోచించాలి. ఇది కూడా ప్రభుత్వానికి ఒక ఆదాయం.. వాళ్లకు కూడా అనుమానం ఉండచ్చు, ప్రజలు థియేటర్ లకు వస్తారో లేదో అని.. కానీ, అఖండ విజయం చూసి అర్ధం అవుతుంది వారికి కూడా అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే హిందూ ఆలయాల పై ఏపీలో జరుగుతున్న దారుణాలకు అనుగుణంగా ఉన్నాయి, మీరు అఖండ లో చెప్పిన డైలాగ్స్.. గుళ్ళను కూల్చేస్తారు రా..” అని ప్రశ్నించగా.. వాస్తవానికి దగ్గరగానే ఈ డైలాగ్స్ రాయడం జరిగిందన్నారు బాలయ్య. ఇప్పుడు కూడా మనం రాజధానికి కూడా దిక్కులేని రాష్ట్రం గా ఉన్నాం.. ఈ సినిమా వల్ల వాళ్లలో కూడా ఒక ఆలోచన రేకెత్తించింది.. మన దేశం & మన రాష్ట్రంలో జరుగుతున్న వాటికి అనుగుణంగానే ఆ డైలాగ్స్ ను పెట్టడం జరిగిందని తెలిపారు.
Anupama Parameswaran : ఏంటమ్మా అనుపమ ఇంతపని చేశావ్.. బరువెక్కిన గుండెతో ఫ్యాన్స్ కామెంట్స్..