Balakrishna : బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్‏మెంట్ అవార్డ్.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..

భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన నటుడు నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. బుధవారం సాయంత్రం దేశ రాజధానిలో ఘనంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ (IFFD) 2026’ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అందజేశారు.

Balakrishna : బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్‏మెంట్ అవార్డ్.. సంతోషంలో నందమూరి ఫ్యాన్స్..
Balakrishna

Updated on: Mar 26, 2026 | 2:56 PM

నందమూరి నటసింహం, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కీర్తికిరీటంలో మరో ప్రతిష్టాత్మక మైలురాయి చేరింది. భారతీయ చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. దేశ రాజధానిలో బుధవారం రాత్రి (మార్చి 25, 2026) అత్యంత వైభవంగా ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ (IFFD) 2026’ వేడుకల్లో ఆయనకు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ (జీవితకాల సాఫల్య పురస్కారం) లభించింది. సుమారు 50 ఏళ్లుగా భారతీయ చలనచిత్ర రంగానికి బాలకృష్ణ చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందజేశారు. ఢిల్లీలోని ‘భారత్ మండపం’ వేదికగా జరిగిన ఈ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతుల మీదుగా బాలయ్య ఈ అవార్డును అందుకున్నారు. తన కెరీర్‌లో 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన, పౌరాణిక, జానపద, సామాజిక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు బాలయ్య.

ఎక్కువ మంది చదివినవి : Sri Sri: ఆ హీరో నా ప్రతి అక్షరానికి విలువ కట్టి పారితోషికం ఇచ్చారు.. శ్రీశ్రీ కామెంట్స్ వైరల్..

ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు బాలీవుడ్ దిగ్గజ నటి షర్మిలా ఠాగూర్ కూడా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రకు మరణానంతర గౌరవంగా ఈ అవార్డును ప్రకటించగా, ఆయన తరపున సీనియర్ హీరోయిన్ హేమమాలిని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కంగనా రనౌత్, మనోజ్ తివారీ వంటి సినీ ప్రముఖులు, ఢిల్లీ మంత్రులు పాల్గొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Monalisa : నన్ను ఎక్కడెక్కడో తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు.. శారీరకంగా వేధించాడు.. మోనాలిసా సంచలన కామెంట్స్..

నందమూరి నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా, బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా ఇప్పటివరకు ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. గత ఏడాది ఆయనను కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారంతో గౌరవించిన సంగతి తెలిసిందే. తాజాగా దక్కిన ఈ అంతర్జాతీయ స్థాయి పురస్కారం ఆయన వ్యక్తిత్వానికి, అంకితభావానికి నిదర్శనమని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ram Gopal Varma: ఆ మహా మనిషికి తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన గొప్ప వ్యక్తి.. రామ్ గోపాల్ వర్మ..

 

ఎక్కువ మంది చదివినవి : Tollywood: కోటి 40 లక్షలు పెట్టి సినిమా తీశా.. అప్పు తీర్చడానికి 6 ఏళ్లు కప్పులు కడిగాను.. టాలీవుడ్ నటుడు..

Follow Us