AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arjun Das: ఆయన నన్ను పిలిచి మరీ నాకు ఈ అవకాశం ఇచ్చారు.. ఆసక్తికర విషయం చెప్పిన అర్జున్ దాస్

సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు.

Arjun Das: ఆయన నన్ను పిలిచి మరీ నాకు ఈ అవకాశం ఇచ్చారు.. ఆసక్తికర విషయం చెప్పిన అర్జున్ దాస్
Arjun Das
Rajeev Rayala
|

Updated on: Jan 19, 2023 | 9:06 AM

Share

విలన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా మారిన వాళ్లు చాలా మంది ఉన్నారు. ఆ లిస్ట్‌లో ఈ యాక్టర్ పేరు కూడా ఉంటుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిక సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. జనవరి 26న భారీస్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా నటుడు అర్జున్ దాస్ ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు.

పెరుమాళ్ సినిమా తర్వాత చాలాకాలం ఎదురుచూశాను. ఖైదీ, అంధఘారం, మాస్టర్ సినిమాల నుంచి కెరీర్ ఊపందుకుంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ గారి సినిమాలలో భాగం కావడం సంతోషంగా ఉంది. ఆయన వల్లే ఇంత గుర్తింపు వచ్చింది. సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో ‘బుట్ట బొమ్మ’ సినిమా చేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది అన్నారు అర్జున్.

ఒకసారి నిర్మాత వంశీ గారు ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. ఆయన నా మీద ఎంతో నమ్మకం ఉంచి, ఈ సినిమా ఖచ్చితంగా మీరే చేయాలని అన్నారు. మరుసటి రోజు దర్శకుడు రమేష్ చెన్నై వచ్చి నన్ను కలిసి కథ, పాత్ర గురించి వివరించారు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చి వంశీ గారిని కలిసి ఈ సినిమాలో భాగం కావడం జరిగింది. అప్పటివరకు నేను వంశీ గారిని కలవలేదు. ఆ రోజే ఆయనను మొదటిసారి కలిశాను. పిలిచి మరీ నాకు ఈ అవకాశం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇందులో నా పాత్ర పేరు ఆర్.కె. నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. కొత్త అనుభూతిని ఇస్తుంది. తెలుగు ప్రేక్షకుల నుంచి నాకు లభిస్తున్న ఆదరణ అసలు ఊహించలేదు. ఒకసారి హైదరాబాద్ లో ఒక మాల్ కి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను గుర్తుపట్టి నాతో ఫోటోలు దిగడానికి రావడం చూసి ఆశ్చర్యపోయాను. షూటింగ్ కోసం వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ లభించిన స్వాగతం అసలు మరచిపోలేను. కొందరికి నా పేరు గుర్తులేకపోయినా సినిమాల్లో పోషించిన పాత్రల పేరుతో పిలుస్తూ మాట్లాడిస్తున్నారు. నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా దగ్గర అయ్యాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. నేను ఎన్నో తెలుగు సినిమాలు చూశాను.. కానీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశం వస్తుందని ఊహించలేదు. నాకు తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడం, డబ్బింగ్ సినిమాలతో నేను తెలుగు ప్రేక్షకులకు ఇంతలా చేరువయ్యాయని తెలియడం చాలా సంతోషంగా ఉంది.

అలాగే నా దగ్గరకు వస్తున్న పాత్రలను బట్టి ఎంచుకుంటున్నాను. నేను అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెగటివ్ రోల్స్ లో కూడా ఏదైనా కొత్తదనం ఉంటేనే చేస్తాను. అలాగే విభిన్న పాత్రలు పోషిస్తూ నటుడిగా ఇంకా నిరూపించుకోవాలి అనుకుంటున్నాను. ఖైదీ తర్వాత ఎక్కువగా నెగటివ్ రోల్స్ వచ్చాయి. మాస్టర్ తర్వాత ఊహించనివిధంగా రొమాంటిక్ రోల్స్ వచ్చాయి. ఇలా ఒక్కో సినిమా తర్వాత ఒక్కో రకమైన పాత్రలు వస్తున్నాయి.

ఎక్కువగా నా వాయిస్ గురించి మాట్లాడుతుంటారు. అలాగే నా నటనను కూడా ఇష్టపడుతున్నారని ఆశిస్తున్నాము. బుట్టబొమ్మ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను. నేను ఈ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు.మా నిర్మాతలు సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. దర్శకుడు రమేష్ మీద నమ్మకం ఉంచి, ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు అని అన్నారు.