Pushpaka Vimanam: బాలీవుడ్ రీమేక్‏లో పుష్పక విమానం.. ఆనంద్ దేవరకొండ సినిమాకు భారీగా డిమాండ్ !!

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. మొదటి సినిమా దొరసాని

Pushpaka Vimanam: బాలీవుడ్ రీమేక్‏లో పుష్పక విమానం.. ఆనంద్ దేవరకొండ సినిమాకు భారీగా డిమాండ్ !!
Pushpaka Vimanam

Updated on: Nov 17, 2021 | 7:03 PM

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. మొదటి సినిమా దొరసాని అంతగా హిట్ అవ్వకపోయినా.. ఆనంద్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమా తర్వాత ఆనంద్ మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు  యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లెటేస్ట్ చిత్రం పుష్పక విమానం. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి కొత్త దర్శకుడు దామోదర దర్శకత్వం వహించాడు. నవంబర్ 12న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

తాజాగా ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడిందని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు. బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు తమ సినిమా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయన్నారు. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండడం ఈ మూవీని యూనిక్ గా మార్చాయని.. సినిమాలో ఈ క్వాలిటీనే బాలీవుడ్ మేకర్స్ ను రీమేక్ కు పోటీ పడేలా చేస్తున్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా మంచి కలెక్షన్లతో థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ సినిమాను సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్, టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Also Read: